అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎం31పై రూ.ఐదు వేల వరకు తగ్గింపు అందించారు. దీనిపై రూ.1,500 క్యాష్‌బ్యాక్, రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను అందించారు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్లపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా కలిపితే రూ.10 వేలలోపే ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. శాంసంగ్ గెలాక్సీ ఎం31
ఈ ఫోన్ అసలు ధర రూ.21,999 కాగా, ఈ సేల్‌లో రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.14,900 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. హెచ్ఎస్‌బీసీ, ఆర్‌బీఎల్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం31 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్
ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుంటే.. ఇది మీకు మంచి ఆప్షన్. దీని అసలు ధర రూ.14,499 కాగా, ఈ సేల్‌లో రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.11,250 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 6.4 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ యూ-కట్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. శాంసంగ్ గెలాక్సీ ఎం32
శాంసంగ్ గెలాక్సీ ఎం32 అసలు ధర రూ.16,999 కాగా, ఈ సేల్‌లో రూ.12,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.12,250 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందించనున్నారు. అయితే ఇది మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉండనుంది. హెచ్ఎస్‌బీసీ, ఆర్‌బీఎల్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో 6.4 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ అందించనున్నారు. దీని కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి