కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర, బుల్లితెర నుంచి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కరోనా బారిన పడిన చిరంజీవి..ఈ విషయాన్ని ట్వీట్ చేశారు..
పాజిటివ్ వచ్చిన విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశారు చిరంజీవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడినట్టు పోస్ట్ చేశారు. గతంలో ఓసారి చిరంజీవి కరోనా బారిన పడ్డారనే ప్రచారం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించిన చిరంజీవి తప్పుడు కరోనా కిట్ తో పరీక్షించుకున్నానని..తాను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానన్న చిరంజీవి... గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన వారంతా వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి సూచించారు.
సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉండగా, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, భోళా శంకర్, దర్శకుడు బాబితో మరో ప్రాజెక్ట్ సహా వెంకి కుడుములతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి కరోనా బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడక తప్పదు. మరి చిరు కరోనా బారిన పడడంతో షెడ్యూల్స్ అన్నీ రెండు వారాల వెనక్కు వెళ్లినట్టే...
Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి