కొణిదెల హీరో పవన్ తేజ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. నటి, ప్రముఖ యాంకర్ మేఘనను పవన్ తేజ్ పెళ్లాడనున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పవన్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
'నేను తనను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో తన వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అని ఈ పోస్ట్‌లో రాశాడు. మరోవైపు మేఘన కూడా.. 'నా ప్రేమను కనుగొన్నాను, తనతో నిశ్చితార్థం కూడా జరిగింది. నా మనసు గాల్లో తేలుతున్నా, నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం మొత్తం నీకే సొంతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కొణిదెల పవన్ తేజ్‌కు... మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో పవన్ తేజ్ హీరోగా ఆకట్టుకున్నాడు. ఇందులో హీరోయిన్‌గా యాంకర్ మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. పవన్ తేజ్ ప్రస్తుతం నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్‌గా అలరిస్తోంది.
ఉప్పెన, ఆచార్య సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన కొణిదెల పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మరోవైపు మేఘన కూడా స్మాల్ స్క్రీన్‌పై ఈవెంట్లలో అలరిస్తూ ఉంటుంది.