'పఠాన్' మూవీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'. ఈ మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం ట్రైలర్(Telugu Prevue)ను విడుదల చేసింది. ‘పఠాన్’ జోష్ తో ఉన్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’తో ఆ దూకుడు కొనసాగించేలా ఈ ట్రైలర్ కనిపించింది. షారుఖ్ ‘జవాన్’ ట్రైలర్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది. 2 నిమిషాల 12 సెకన్లలో కింగ్ ఖాన్ షారూఖ్ సత్తా చాటారు.
ఇక ఈ ట్రైలర్ లో షారుఖ్, ఇతర స్టార్స్ కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది యువ తరంగం అనిరుధ్ రవిచందర్ సంగీతం. ట్రైలర్ నేపథ్యంలో నడుస్తున్న ర్యాప్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రాజ కుమారి పాడిన ఈ ర్యాప్ అందరినీ అలరిస్తోంది. ఇంతకీ ఈ రాజ కుమారి ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
అసలు ఎవరు ఈ రాజ కుమారి?
ర్యాప్ స్టార్ రాజ కుమారి అసలు పేరు శ్వేతా యల్లాప్రగడ రావు. ఆమె జనవరి 11, 1986న కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్‌లో జన్మించింది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వారు. ఆమె శాస్త్రీయ నృత్యకారిణిగా శిక్షణ తీసుకుంది. 5 సంవత్సరాల వయస్సులో తొలి ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ రాపర్, సింగర్, పాటల రచయితగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె గ్వెన్ స్టెఫానీ, ఇగ్గీ అజలేయా, ఫిఫ్త్ హార్మొనీ, సిద్ధు మూస్‌వాలా, నైఫ్ పార్టీ, ఫాల్ అవుట్ బాయ్ సహకారంతో బాగా పాపులర్ అయ్యింది.
14 ఏండ్ల నుంచే ‘ఇండియన్ ప్రిన్సెస్’గా గుర్తింపు
వాస్తవానికి లాస్ ఏంజిల్స్‌లో దక్షిణ భారత అమ్మాయి రాపర్ గా ఎదగడం అంత సులభం కాదని ఆమె వెళ్లడించింది. అయినా, తను కష్టపడి ఈ స్థాయికి చేరుతున్నట్లు తెలిపింది. రాజ కుమారి 5వ తరగతి చదువుతున్నప్పుడు ఫ్యూజీస్ ఆల్బమ్ ‘ది స్కోర్’ ద్వారా హిప్ హాప్ రూపొందించింది. 14 సంవత్సరాల వయస్సు నుంచి అమెరికా ప్రజలు ఆమెను ‘ఇండియన్ ప్రిన్సెస్’, 'రాజ కుమారి'గా పిలుస్తున్నారు.
నటిగానూ రాణిస్తున్న రాజ కుమారి
ప్రస్తుతం పలు భారతీయ సినిమాల్లో రాజ కుమారి తన గాత్రం వినిపిస్తోంది. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లోనూ కనిపిస్తోంది. తాజా బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’లో నటించింది. అలియా భట్, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రంతో ఆమె న్యాయనిర్ణేతగా కనిపించింది. ‘జవాన్’ ర్యాప్ తో మరింత బాగా పాపులర్ అవుతోంది.
Read Also: తమిళనాడులో వెకేషన్ ఎంజాయ్ చేసిన జక్కన్న, కుటుంబంతో కలిసి ఆలయాల సందర్శన
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial