మే ఎండింగ్ కి వచ్చేశాం కాబట్టి ఈ నెలలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలేంటో తెలుసుకుందాం. ఈ నెల డబ్బింగ్, స్ట్రెయిట్, ఓటీటీ మొత్తం కలుపుకుంటే 17 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో రెండు పెద్ద హిట్స్ ఉన్నాయి. మే నెలలో 'సర్కారు వారి పాట' డామినేషన్ కనిపించగా.. 'ఎఫ్3' సినిమా మంచి ముగింపుని ఇచ్చింది. మే మొదటివారంలో 'అశోకవనంలో అర్జునకల్యాణం', 'భళా తందనాన', 'జయమ్మ పంచాయితీ' సినిమాలు విడుదలయ్యాయి. 

 

వీటిలో విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జునకల్యాణం' సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా బాగుందంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపే 'సర్కారు వారి పాట' సినిమా రిలీజయింది. అలా విశ్వక్ సేన్ సినిమాపై ఎఫెక్ట్ పడింది. ఇక సుమ నటించిన 'జయమ్మ పంచాయితీ' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్లను ప్రమోషన్స్ కోసం తీసుకొచ్చింది సుమ. కానీ ఈ సినిమా జనాలను మెప్పించలేకపోయింది. శ్రీవిష్ణు 'భళా తందనాన' మరో ఫ్లాప్. ఇక మే రెండో వారంలో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదలైంది. దాదాపు ఎనభై శాతం థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది ఈ సినిమా. ఆ తరువాత శివకార్తికేయన్ 'డాన్' సినిమా వచ్చింది. 

 

ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. మహేష్ సినిమా కారణంగా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఆ తరువాత 'శేఖర్', 'డేగల బాబ్జీ', 'ధగడ్ సాంబ' లాంటి సినిమాలొచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మే చివరి వారంలో 'ఎఫ్3' సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. 

 

ఈ సినిమా తరువాత ఆది సాయికుమార్ 'బ్లాక్' రిలీజయ్యింది. ఇది మరో ఫ్లాప్ గా నిలిచింది. ఓటీటీలో విడుదలైన కీర్తి సురేష్ 'చిన్ని'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు వచ్చిన 'దొంగాట', 'రైటర్' సినిమాలు ప్రభావం చూపలేకపోయాయి. సో.. ఓవరాల్ గా మే నెల మొత్తం మహేష్ బాబుదే హవా అని చెప్పాలి.