Devara Movie: ప్రతిష్టాత్మక ‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
‘దేవర’ మూవీలో మరో బ్యూటీ
తాజాగా ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఈ చిత్రంతోనే తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో హీరోయిన్ కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన శృతి మరాఠే ఈ చిత్రంలో నటిస్తుందట. ‘దేవర’లో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్రకు జాన్వీ కపూర్ ఓకే కాగా, రెండో పాత్రకు శృతిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
‘దేవర’ సినిమా రిలీజ్ వాయిదా
అటు ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ చాలా టైమ్ తీసుకుంటున్నారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకుంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’
‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి జాన్వీ రీసెంట్ గా కీలక విషయాలు వెల్లడించింది. తాను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తనలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారని తెలిపింది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: ‘12th ఫెయిల్’కు అరుదైన ఘనత - ఆ జాబితాలో చేరిన ఏకైక ఇండియన్ మూవీగా గుర్తింపు