టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచడంలో సినిమా యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ‘జిన్నా’ను పూర్తి స్థాయిలో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలా కాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణుకు ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. జిన్నా సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు, ఆన్ లొకేషన్ వీడియోలు ఆడియెన్స్ లో  సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో పచ్చళ్ల స్వాతిగా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ పాత్రను పరిచయం చేస్తూ ఇటీవలే ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 


ఈ నేపథ్యంలో ‘జిన్నా’  సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచు విష్ణు క్యారెక్టర్ తెగ ఆకట్టుకుంది. హాట్ బ్యూటీలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ తమ అందచందాలతో కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ చూసి సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచిందని చెప్పుకోవచ్చు. టెంట్ హౌజ్‌కు ఓన‌ర్‌గా మంచు విష్ణు ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. జిన్నా టైంకు రావ‌డంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తుంటాడు అంటూ ఇందులో విష్ణు క్యారెక్ట‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో మంచు విష్ణు క‌నిపించ‌నున్నాడు. ఏ ప‌ని చేయ‌కుండా.. ఊరంత అప్పులు చేస్తూ గ‌డుపుతున్నా విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది. అయితే సన్నీలియోనికు దెయ్యం ప‌ట్టిన‌ట్లు ఈ టీజర్ లో చూపించారు. ఆ దయ్యం కథ ఎలా ఉండబోతుంది? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ టీజర్ చూస్తుంటే మంచు విష్ణు ఖాతాలో హిట్ పడ్డట్లే కనిపిస్తోంది.  
 ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాను ద‌స‌రా సందర్భంగా.. అక్టోబ‌ర్ 5న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.


‘జిన్నా’ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. AVA ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందించారు. జి నాగేశ్వరరెడ్డి కథ రాశారు.  కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?


Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?