కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీపై, మంచు విష్ణుపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన దగ్గరనుంచి మంచు ఫ్యామిలీపై మీమ్స్ ఓ రేంజ్ లో పడ్డాయి. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా విడుదలైన తరువాత కూడా ట్రోలింగ్ ను కంటిన్యూ చేశారు. తమ ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేయడంతో మంచు ఫ్యామిలీ సీరియస్ అయింది. 

 

ఈ క్రమంలో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. తమ మీద ట్రోలింగ్ ఆపకపోతే పదికోట్ల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. చివరికి ఆ ప్రకటనను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో మంచు ఫ్యామిలీని వదిలేరా లేరు. రీసెంట్ గా మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే దాన్ని కూడా ట్రోల్ చేశారు. 

 

ఇదిలా ఉండగా.. తాజాగా మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో నవ్వుతూ కనిపించారు. ఫోన్ లో ఏదో చూస్తూ.. నవ్వుకుంటూ కనిపించిన ఫొటోను షేర్ చేస్తూ.. 'నేనెందుకు నవ్వుతున్నానో తెలుసా..?' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు సైలెంట్ గా ఉంటారా..? వెంటనే విష్ణుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఓ నెటిజన్ 'సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ చూసి నవ్వుకుంటున్నావ్' అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ 'నీ ఇంటర్వ్యూలు, మీమ్స్ చూసి నవ్వుకుంటున్నావ్' అంటూ కామెంట్ చేశాడు. మరి దీనిపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!