ప్రముఖ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విషయాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన పలు అంశాలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఓ వీడియోను షేర్ చేస్తూ తనను బాగా ఏడిపించిందని రాసుకొచ్చారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా తాజాగా తనకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. దాన్ని చూసి భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. వాళ్లు ఇచ్చిన బహుమతికి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఇంతకీ ఆయన కూతుళ్లు ఏం బహుమతి ఇచ్చారు? ఎందుకు ఆయనకు కన్నీళ్లు వచ్చాయయో తెలుసుకుందాం. మార్చి 1 (బుధవారం)న మంచు విష్ణు-ఆయన సతీమణి విరానికా పెళ్లి రోజు. 15వ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. వారి పెళ్లి రోజు సందర్భంగా చాలా మంది బహుమతులు ఇచ్చారు. కుమార్తెలు అరియానా, వివియానా తన తల్లిదండ్రులను సర్‌ప్రైజ్ చేస్తూ ఓ వీడియోను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వీడియోలో విష్ణు, విరానికాకు సంబంధించిన పలు స్పెషల్ మూమెంట్స్ ను పొందుపర్చారు. ‘మై ఫాదర్ లవ్స్ మై మామ్’ అంటూ ఓ పాట పాడుతూ దానికి స్పెషల్ ఫోటోలు యాడ్ చేశారు. ఈ పాట చూసి మంచు విష్ణు కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఈ సాంగ్ కంప్లీట్ అయ్యే సరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్. మీరు ఇచ్చిన ఈ సర్ ప్రైజ్‌ను నేను ఏనాడు మర్చిపోను” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో ఫ్రెండ్ షిప్ పాట పాడి ప్రేక్షకులను ఎంతో అలరించారు.
మా నాన్న కంటే ఎక్కువ భయపడే వ్యక్తి విరానికా- విష్ణు
ఇక తన పెళ్లి రోజు సందర్భంగా మంచు తన భార్య గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తండ్రి అంటే తనకు ఇప్పటికీ చాలా భయం అని చెప్పిన విష్ణు.. ఆయన కంటే ఎక్కువ భయపడే మరో వ్యక్తి ఉన్నట్లు వెల్లడించారు. తను ఎవరో కాదు నా భార్య విరానికా అని చెప్పారు. “మా నాన్న కంటే నేను ఎక్కువ భయపడే ఒకే ఒక్క వ్యక్తి విరానికా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు” అంటూ ఆమెతో కలిసి తీసుకున్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ స్పందించారు. విష్ణు దంపతులకు హార్థిక శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి సంతోషకరమైన మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read Also: సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన మల్లు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్