మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకొని ఏడాది అయిన సందర్భంగా మంచు విష్ణు ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ మెంబర్షిప్ గురించి, 'మా' బిల్డింగ్ గురించి మాట్లాడారు.


ఫారెన్ లో ఫండ్ రైజింగ్ ఈవెంట్:

''ఎలెక్షన్స్ సమయంలో మేము ఏమైతే ప్రామిస్ చేశామో అవి తొంబై శాతం పూర్తి చేశాము. ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాలని.. నటీనటుల పేర్లతో ఒక బుక్ ప్రింట్ చేయించాం. అది యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ కి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియా యాప్ కూడా రెడీ చేస్తున్నాం. మహిళల సంరక్షణ కోసం ఓ కమిటీను ఏర్పాటు చేశాము. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సలహాదారుగా పని చేస్తున్నారు. ఈ అసోసియేషన్ లో లైఫ్ టైమ్ మెంబర్ కావాలంటే.. హీరో, హీరోయిన్లు కనీసం రెండు సినిమాల్లో నటించి, అవి రిలీజై ఉండాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కనీసం పది సినిమాల్లో నటించి ఉండాలి. రెండు నిమిషాలపాటు సినిమాలో డైలాగ్స్ ఉంటేనే మెంబర్షిప్ ఇస్తాం. లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నవాళ్లకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ అసోసియేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయబోతున్నాం. జనవరిలో ఈవెంట్ ఉంటుంది. అది ఫారెన్ లో చేయాలనుకుంటున్నాం. కొన్ని హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ తో డీల్ పెట్టుకున్నాం. అందులో అసోసియేషన్ మెంబర్స్ కి డిస్కౌంట్ ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. 
 

నాలుగేళ్ల తరువాతే 'మా' బిల్డింగ్: 

ఇక 'మా' బిల్డింగ్ గురించి వస్తే.. ''అసోసియేషన్ మెంబర్స్ కి రెండు ఆప్షన్స్ ఇచ్చాను. సొంత డబ్బుతో ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కడతానని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ను పడగొట్టి అక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అందులో స్పేస్ కొని ఇస్తాననేది రెండో ఆప్షన్. దానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది. అయితే మా సభ్యులు రెండో ఆప్షన్ ఎంపిక చేసుకున్నారు'' అంటూ మంచు విష్ణు తెలిపారు.  

 


 

మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'జిన్నా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా దసరా బరిలో నిలవాల్సి ఉండేది. కానీ, చిరంజీవి ‘ గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో వాయిదా వేశారు.  అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'జిన్నా' విడుదల అవుతుంది. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ ప్లే  అందించిన ఈ సినిమాను .. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.  రక్షిత్ మాస్టర్ ఈ మూవీకి కొరియోగ్రాఫర్‌ గా చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌ గా అనూప్ రూబెన్స్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు.