హైదరాబాద్ నాంపల్లిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి(Chiranjeevi), గరికపాటి(Garikapati) పాల్గొన్నారు. గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని సీరియస్ అయ్యారు. దీంతో మెగా ఫ్యాన్స్ గరికిపాటిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతకు ముందు మాట్లాడిన చిరంజీవి గరికపాటిపై తన గౌరవాన్ని చాటుకున్నారు. కానీ గరికపాటి చిరుపై సీరియస్ అవ్వడంతో మెగా అభిమానులు తట్టుకోలేకపోయారు.

 

Chiranjeevi's reaction to Garikipati issue: ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. కొందరు నేరుగా సినిమా ఈవెంట్స్ లో కూడా మాట్లాడారు. చిరంజీవి లాంటి గొప్ప మనిషిని పట్టుకొని గరికిపాటి స్టేజ్ పై అలా అనడం తప్పంటూ సీరియస్ అవుతున్నారు. తాజాగా ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి నేరుగా స్పందించారు. రీసెంట్ గా విలేకర్ల సమావేశంలో పాల్గొన్న చిరు.. 'గరికపాటి పెద్దాయన. గొప్ప వ్యక్తి. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు' అని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికైనా మెగాఫ్యాన్స్ గరికపాటిపై ట్రోలింగ్ ఆపుతారేమో చూడాలి!

 

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా 'గాడ్  ఫాదర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాకి టాక్ బాగున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. 

 

గోదావరి యాసలో చిరు డైలాగ్స్:

ప్రస్తుతం చిరు.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మెగా154 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి చిరు మాట్లాడారు. ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతానని.. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.

 

బాబీ డైరెక్ట్ చేస్తోన్న 'మెగా154' చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

 

ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది.