మంచు మనోజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న కొడుకు. మంచు కుటుంబ నుంచి మంచి హీరో అవుతాడని అనుకున్నా.. తగిన గుర్తింపు రాలేదు. గతంలోనే ఈయన ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి, 2015లో పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. 2019లో  విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అయినా, మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. 


భూమా మౌనికరెడ్డితో రెండో పెళ్లి?


మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి- శోభ దంపతుల రెండో కుమార్తె మౌనికరెడ్డిని పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డి కలిసి కనిపించారు. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ వినాయక మండపంలో వీరిద్దరు కలిసి గణనాథుడికి పూజలు చేశారు. ఈ నేపథ్యంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లికి బంధువులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 


ఇద్దరికీ రెండో పెళ్లే


భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత.. వీరి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, మౌనిక.. తన సోదరి అఖిల ప్రియకు అండగా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఓ కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ జైలుకు వెళ్లడంతో నియోజకవర్గంలో మౌనిక కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.


మనోజ్ తన మొదటి భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన తర్వాత.. ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. భూమ మౌనికా రెడ్డికి కూడా ఇదివరకే పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కూడా ఒంటరిగానే ఉంటున్నారు. కష్ట సమయాల్లో మనోజ్, భూమా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మౌనిక, మనోజ్ మధ్య స్నేహం కుదిరి ఉండొచ్చని టాక్. 


చెప్పకనే చెప్పేసిన మనోజ్


భూమా మౌనిక రెడ్డితో పెళ్లి వార్తల గురించి మనోజ్ స్పందించాడు. అది తన పర్సనల్ విషయం అన్నాడు. ఓ మంచి రోజు చూసుకుని అందరికీ చెప్తానని వెల్లడించాడు. మొత్తంగా తన పెళ్లి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్  ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాలో  నటిస్తున్నాడు.






Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్