Manchu Manoj- Vennela Kishore: మంచు మనోజ్, వెన్నెల కిషోర్ వాట్సాప్ చాటింగ్ లీక్ - బాబోయ్, ఆ భాషేంటి?

వెన్నెల కిషోర్, మంచు మనోజ్ సినిమాల్లో చేసే కామెడీ మామూలుగా ఉండదు. బయట కూడా వీరిద్దరు అంతే ఫన్నీగా ఉంటారు. వీరిద్దరి కాంబోలో త్వరలో ఓ సినిమా తెరెక్కబోతోంది.

Continues below advertisement

హీరో మంచు మనోజ్, కమెడియన్ వెన్నెల కిశోర్‌లు వాట్సాప్‌లో చేసుకున్న చాంటింగ్ లీకైంది. అయితే, దాన్ని లీక్ చేసింది ఎవరో కాదు.. మంచు మనోజ్. అయితే, ఇదేదో సీరియస్ మేటర్ అనుకుంటే పొరపాటే. సరదాగా వారిద్దరి మధ్యన ఫన్నీ చాటింగ్ మాత్రమే. ఆ సరదా మాటల స్క్రీన్ షాట్‌ను మనోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Continues below advertisement

ఇదేం భాష స్వామి..

ఇద్దరు తెలుగు రాని వ్యక్తులు తెలుగు మాట్లాడినట్లుగా ఉన్న వీరి చాటింగ్ ఫుల్ ఫన్నీగా కొనసాగింది. “నాది ఆగ్రాలో ఉంది.. మీది ఎక్కడ ఉంది చిచా?” అంటూ వెన్నెల కిషోర్ అడిగాడు. దానికి మనోజ్ “నాది హైదరాబాద్ లో ఉంది” అంటూ సమాధానం చెప్పాడ. “వచ్చాక మీకి టైమ్ ఇస్తే మీది కలుస్తా నాది” అన్నాడు కిషోర్. “హ హ హ.. డన్ డన్..” అని రిప్లై ఇచ్చాడు మనోజ్. ఆ తర్వాత “మచ్చా.. నీది హైదరాబాద్ కి వచ్చిందా!?” అంటూ మనోజ్ అడుగుతాడు. “22 నైట్ కి వస్తుంది నాది. లొకేషన్ మార్చింది. సో నాది బాన్సువాడ వచ్చింది” అంటాడు కిషోర్. దానికి మనోజ్ “నాది ఎదురు చూస్తుంది నీది కోసం” అంటూ రిప్లై ఇచ్చాడు. 

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..

మనోజ్ ఆ వాట్సాప్ చాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..  “మా మచ్చా వెన్నెల కిషోర్ తో వాట్సాప్ చాట్ ఇలా ఉంటుంది. మచ్చా.. నీది నాది కాంబో త్వరలో అందరి దానికి చెప్దాం. అప్పుడు మనది వాళ్లది హ్యాపీగా ఉంటుంది” అని క్యాప్షన్ పెట్టాడు. “మీది చాటింగ్ చాలా ఫన్నీగా ఉన్నయ్” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  వెన్నెల కిశోర్, మంచు మనోజ్ కలిసి ‘బిందాస్’ సినిమాలో చేసిన కామెడీ అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించింది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్.. పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నటించిన మేజర్ ‘చంద్రకాంత్’ సినిమాలో బాలనటుడిగా కనిపించిన మనోజ్.. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ‘బిందాస్’ సినిమాతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. అటు ‘వెన్నెల’ సినిమాతో వెండి తెరకు పరిచయమై, అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు కం డైరెక్టర్  వెన్నెల కిషోర్. తెలుగులో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, కొన్ని సినిమాలను తెరకెక్కించాడు కూడా.

Read Also: మాల్దీవుల్లోని ఈ విల్లాలో బస చేసేందుకు జాన్వీ రోజుకు ఎంత చెల్లిస్తుందో తెలుసా?

Continues below advertisement