ఇటీవల పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ కోసం మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటో చూసి పవన్ ఫ్యాన్స్ వింటేజ్ పవన్ కల్యాణ్ అంటూ సంబరపడిపోతుంటే.. పవన్ వ్యతిరేకులు మాత్రం దానిపై మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇటీవల పవన్ పోస్ట్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఫోటోను మంచు లక్ష్మీ ఫోటోకు జతచేశారు.
సినిమాలే రిమేక్ అనుకున్నాం కానీ ఇలా స్టిల్స్ కూడా కాపీ కొడుతున్నావా పవన్ కల్యాణ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ మీమ్స్ పై పవన్ కల్యాణ్ అభిమానులు, ట్రోలర్స్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.
ఆ విషయం పక్కనబెడితే.. మంచు లక్ష్మిని ఎప్పుడూ ఏదొక ట్రోలింగ్ కు గురి చేస్తూ ఉంటారు ట్రోలర్స్. కానీ వాటిపై ఆమె ఎప్పుడూ అంతగా రియాక్ట్ అవ్వదు. అయితే, పవన్‌తో మీమ్‌పై మంచు లక్ష్మీ స్పందించింది. పవన్ కల్యాణ్ ఫోటో పక్కన తన ఫోటో పెట్టడం సంతోషంగా ఉందని అంది. ‘‘గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైతేనే నా ఫోటో పవణ్ కల్యాణ్ పక్కన ఉండటం థ్రిల్ గా ఫీల్ అవుతున్నా’’ అంటూ క్యాప్షన్ పెట్టి ఆ మీమ్ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినీ రంగంలో ఉన్న సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక విమర్శలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఫ్యాన్స్ మావాడు గొప్పంటే.. మావాడు గొప్ప అంటూ ఏకంగా సోషల్ మీడియాలో మిని మాటల యుద్దమే జరుగుతుంది. అదే ఓ స్టార్ హీరో సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఉంటే ఆ విమర్శలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి అలానే ఉంది. ఆయన అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. దానికి ఆయన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూనే ఉంటారు. అయితే పవన్ కేవలం సినిమాల్లో ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే టార్గెట్ చేసేవాళ్లు, కానీ ఇప్పుడు రాజీకీయాల్లోనూ బీజీగా ఉంటున్న నేపథ్యంలో ట్రోల్స్ మరింత పెరిగాయి.
Also Read : టికెట్ రేట్స్ మీద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు - 'తారకరామ' థియేటర్ పునఃప్రారంభంలో నందమూరి నాయకుడు ఏమన్నారంటే?
ప్రస్తుతం పవన్ కల్యాణ్ పలు సినిమా షూటింగ్ లలో బిజీ గా ఉన్నారు. క్రిష్ దర్వకత్వం వహిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఇది కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ దర్వకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రాలన్నీ కూడా వచ్చే సమ్మర్ లోగా పూర్తి చేసి తర్వాత పాలిటిక్స్ లో బిజీ కానున్నారట పవన్. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక వాహనాన్ని కూడా తయారు చేయించుకున్నారు.