Malaika Arora And Arjun Kapoor Cross Paths At An Event: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుమారు ఐదు సంవత్సరాల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా, పట్టించుకోకుండా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగారు. దేశ విదేశాల్లోనూ హ్యాపీగా, జాలీగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. పార్టీలు, పబ్బులు, షికార్లు అంటూ సరదాగా గడిపారు. ఒకానొక సమయంలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి.
పార్టీలో పాల్గొన్న అర్జున్, మలైకా
మొన్నటి వరకు జంటగా ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరు ఈ మధ్య ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ టౌన్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన అర్జున్ కపూర్ బర్త్ డే వేడుకల్లోనూ మలైకా పాల్గొనలేదు. కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కోచర్ వీక్ 2024 వేడుకల్లో మలైకా, అర్జున్ పాల్గొన్నారు. అయితే, ఇద్దరు వేర్వేరుగా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇద్దరు ముందు వరుసలోనే కూర్చున్నా, దూరంగానే ఉన్నారు. అదే సమయలో అభిమానులు అర్జున్ తో సెల్ఫీలు తీసుకుంటుండగా, మలైకా అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పుడు అర్జున్ కలుగజేసుకుని, అభిమానులను పక్కకు జరగమని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కనీసం ఆమె అర్జున్ వైపు చూడకపోవడంతో బ్రేకప్ వార్తలు నిజమేనని అర్థం అవుతోంది.
బ్రేకప్ గురించి నో రియాక్షన్
ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి అధికారికంగా ప్రకటించిన అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇద్దరూ విడిపోయారంటూ మీడియాలో వస్తున్న వార్తలపైనా స్పందించలేదు. కానీ, కొంత కాలంగా ఇద్దరూ కలిసి కనిపించడకపోవడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నా, తాజాగా ఢిల్లీ ఈవెంట్ తో క్లియర్ కట్ గా బ్రేకప్ అయినట్లు తేలిపోయింది.
2017లో విడాకులు.. 2018 నుంచి డేటింగ్
మలైకా, అర్జున్ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. 2018లో ఈ విషయాన్ని వెల్లడించారు. అర్జున్ బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక మలైకా, అర్జున్ మధ్యన సుమారు 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ఆమె గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థులు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి అప్పటికే అబ్బాయి అర్హాన్ జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 21 సంవత్సరాలు. అర్బాజ్ తో విడాకుల తర్వాత అర్జున్ తో డేటింగ్ మొదలు పెట్టింది.
Read Also: ఫస్ట్ టైం 'యానిమల్' వివాదంపై స్పందించిన రణ్‌బీర్ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..