త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు ‘#SSMB28’ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. చేతిలో సిగరెట్‌తో మాసీ లుక్‌లో మహేష్ బాబును ఈ పోస్టర్‌లో చూడవచ్చు.