Nandigam Suresh Babu: పార్టీని మోసం చేయడం వల్లే ఆమెపై వేటు, చంద్రబాబుతో జాగ్రత్త- ఎంపీ నందిగాం సురేశ్

Nandigam Suresh Babu: కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడం వల్లే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చిందని వైసీపీ ఎంపీ సురేష్ బాబు తెలిపారు. 

Continues below advertisement

Nandigam Suresh Babu: కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడం వల్లే తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పార్టీని తొలగించినట్లు వైసీపీ ఎంపీ సురేష్ బాబు తెలిపారు. పార్టీ గీత దాటి ఎవరు ఇలా ప్రవర్తించినా ఇలాంటి చర్యలే తీసుకుంటామన్నారు. అలాగే దళిత మహిళ కాబట్టే ఇలాంటి చర్యలు తీసుకున్నారని టీడీపీ అంటోందని.. కానీ వ్యక్తిగత తప్పులకు, కులాలకు సంబంధం ఏముండదని ఎంపీ సురేష్ బాబు వివరించారు. నిజంగా ఆమె తప్పు చేసి ఉండకపోతే.. ఇక్కడే ఉండి మాట్లాడాల్సింది పోయి, హైదరాబాద్ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అలాగే అమరావతి రాజధాని గురించి చెప్పడం ఏంటని అన్నారు. గతంలో ఆమె నోటితో ఆమే చంద్రబాబును తిట్టిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లన్నీ.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనంటూ విమర్శించారు. రావడం రావడమే... ఆమె సమస్య గురించి చెప్పకుండా అమరావతి రాజధాని గురించి మాట్లాడుతుంటేనే అర్థం అవుతోందని అన్నారు.

Continues below advertisement

మహిళలకు తాము గౌరవం ఇస్తున్నామని.. మీకు మా నుంచి ఎలాంటి హానీ ఉండదని ఎంపీ సురేష్ బాబు ఉండవళ్లి శ్రీదేవిని ఉద్దేశించి మాట్లాడారు. కాకపోతే మీరు వెళ్లింది.. చంద్రబాబు వద్దకు అని, అక్కడ జాగ్రత్తగా లేకపోతే మీ పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించుకుని అడుగు వేయమని సూచించారు. ఈర్ష్య రాజకీయాలకు, దుర్మార్గమైన ఆలోచనలకు నిలువుటద్దం అయిన చంద్రబాబు చంకన చేరి... మీరు చేసిన తప్పును అమరావతి ప్రజలపై రుద్దటం సరికాదంటూ కామెంట్లు చేశారు. పార్టీ గీత దాటడం వల్లే మిమ్మల్ని పార్టీ నుంచి తొలగించారని మరోసారి స్పష్టం చేశారు. 

మరోవైపు ఉండవల్లి శ్రీదేవి కామెంట్లు

పార్టీ నుంచి తనను తప్పించేందుకు ముందు నుంచి తనపై కుట్ర జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను బూచీగా చూపి తనపై వేటు వేశారని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి అన్నారు. తనపై కొంత మంది వైఎస్ఆర్ సీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర ఆరోపణలతో వేధిస్తున్నారని శ్రీదేవి అన్నారు. ఈ వార్తలు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా వచ్చాయని అన్నారు. తానేమైనా గ్యాంగ్ స్టరా అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ అంటూ కథనాలు వస్తున్నాయని అన్నారు. తన ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాలో భాగంగా అందరూ ముడుపులు పంచుకున్నారని, ఉద్ధండరాయుని పాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ప్రశ్నించారు. తాను లోకల్ దందాలకు సహకరించడంలేదని ఇలా వేటు వేశారని అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

పిచ్చి కుక్కతో సమానంగా చూశారు - శ్రీదేవి
‘‘నేను ఓటు వేసేటప్పుడు అక్కడేమైనా కెమెరా పెట్టారా? టీడీపీకి ఓటు వేసిన 23 మంది ఎమ్మెల్యేల్లో జనసేన ఎమ్మెల్యే కూడా ఉండి ఉండొచ్చు. నన్ను టార్గెట్ చేసి, తప్పించాలని చూస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు. పక్కా పథకంలో భాగంగానే నాపై నిందలు వేశారు. ముందు నుంచి నాపై ప్రీ ప్లాన్డ్‌గా కుట్ర జరిగింది. నన్ను పిచ్చికుక్కతో సమానంగా చూశారు. ఒక డాక్టర్ ని తన్ని రోడ్డుపై పడేశారు.

Continues below advertisement