Mahesh Babu: సితారతో కలిసి డాన్స్ షోలో సందడి చేయనున్న మహేష్ బాబు!

ఓ డాన్స్ షోకి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే.. మహేష్ తో పాటు అతడి గారాల కూతురు సితార కూడా ఈ షోలో కనిపించబోతుంది.

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరకి కాస్త దూరంగా ఉంటారు. బాగా ఫేమస్ అయిన టీవీ షోల్లో మాత్రం తళుక్కున మెరిశారు. ఇప్పుడు ఓ ఛానెల్ లో నిర్వహిస్తోన్న డాన్స్ షోకి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే.. మహేష్ తో పాటు అతడి గారాల కూతురు సితార కూడా ఈ షోలో కనిపించబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ తన కూతురితో కలిసి సెట్స్ పైకి వెళ్లారు. 

Continues below advertisement

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ తన కూతురు చేయి పట్టుకొని నడుస్తూ కనిపించారు. మహేష్ స్టైలిష్ అవుట్ ఫిట్స్ ధరించారు. సితార కూడా గ్లిట్టర్ ఫ్రాక్ వేసుకొని స్టైలిష్ గా రెడీ అయింది. మరి ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి. 

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

మహేష్ తో యాక్షన్..

తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్

Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్

Continues below advertisement
Sponsored Links by Taboola