సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజుని(ఆగస్టు 9) గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెద్ద హీరోల పుట్టినరోజులప్పుడు వారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం లాంటి పెద్ద నగరాల్లో స్పెషల్ షోలు వేస్తుంటారు. అవి కూడా మహా అయితే ఒకట్రెండు షోలే. కానీ ఈసారి మహేష్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల స్పెషల్ షోలు ప్లాన్ చేశారు.
మహేష్ బర్త్‌డేకి పది రోజుల ముందే రాజమండ్రిలో 'ఒక్కడు' స్పెషల్ షోతో సంబరాలు మొదలుపెట్టేశారు. ఆ షోకి వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏదో కొత్త సినిమా విడుదలైన తరహాలో హడావిడి చేశారు. మిగిలిన షోల్లో ఇంతకుమించిన హంగామా గ్యారెంటీ అని అంటున్నారు. ఈ షోలకు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెడితే హాట్ కేక్స్ లా అమ్ముడైపోతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సైతం డబుల్ డిజిట్ నెంబర్స్ లో షోలు ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోల విషయంలో అత్యధిక వసూళ్ల రికార్డు ఆల్రెడీ మహేష్ బాబు సొంతం అయిపోయింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 4 వేళా డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని షోలకు సంబంధించిన కలెక్షన్స్ గ్రాస్ లెక్కేస్తే పెద్ద అమౌంట్ కనిపిస్తోంది.
ఈ డబ్బులన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాల్లోకి వెళ్లడం లేదు. సినిమా రైట్స్ కోసం కొంత మొత్తాన్ని చెల్లించి, థియేటర్లకు అద్దెలు ఇచ్చి.. మిగిలిన డబ్బుని మహేష్ బాబు పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి ఉపయోగించనున్నారట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొత్తానికి తమ అభిమాన హీరో పుట్టినరోజుకి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారన్నమాట!
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?