బాలీవుడ్ ఇండస్ట్రీపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోమవారం నాడు జరిగిన 'మేజర్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు మహేష్. ఈ క్రమంలో బాలీవుడ్ కి సంబంధించిన ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. బాలీవుడ్ తనను భరించలేదని.. అక్కడ సినిమాలు చేసి టైం వేస్ట్ చేయనంటూ చెప్పుకొచ్చారు మహేష్.


 సౌత్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన హిందీలో ఓ సినిమా చేయాలని నార్త్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. అలాంటిది మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లనని క్లారిటీగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


'హిందీ ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వారు నన్ను భరించగలరని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుంది. ఇక్కడ నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. పైగా టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే.. నా ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది' అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. 


ఇక మహేష్ బాబు నిర్మించిన 'మేజర్' సినిమా జూన్ 3న విడుదల కాబోతుంది. అలానే మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?


Also Read: చీపురు పుల్లలతో చిరు, చెర్రీ కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్ - ఆ టాలెంట్‌కి రామ్ చరణ్ ఫిదా, ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం