సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? అంటే ప్రేక్షకులు ఎవరైనా సరే ఠక్కున  తడుముకోకుండా 'ఎస్.ఎస్. తమన్' అని చెబుతారు. అయితే... ఇప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే... ఆయన్ను సినిమా నుంచి తప్పించారని ఫిల్మ్ నగర్ టాక్. లేదంటే తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట!


తమన్ వద్దంటున్న మహేష్?
సంగీత దర్శకుడిగా తమన్ వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు చిత్రసీమ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఎందుకు? అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహేష్ లాస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'లో సంగీతం పట్ల ఘట్టమనేని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. మహేష్ మాత్రం ఓసారి స్టేజిపైకి వెళ్లి మరీ స్టెప్ వేశారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు తమన్ సంగీతానికి ఓకే చెప్పి, ఇప్పుడు వద్దని అనడం ఏమిటనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది.
 
ఆల్రెడీ ట్యూన్స్ కంప్లీట్ చేసిన తమన్!
మహేష్ బాబు దుబాయ్‌లో ఉన్నప్పుడు ఆయనను కలవడానికి త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు తమన్ కూడా వెళ్ళారు. తిరిగి వచ్చిన రెండు మూడు వారాలకు మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రెండు ట్యూన్స్ కూడా కంప్లీట్ చేశారని టాక్. కృష్ణ మరణంతో ప్రస్తుతం సినిమా వర్క్స్ మీద మహేష్ కాన్సంట్రేషన్ చేయడం లేదు. ఆయన మళ్ళీ రెగ్యులర్ సినిమా లైఫ్‌లోకి  వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది.
 
తమన్ బదులు అనిరుధ్?
తమన్ బదులు అనిరుధ్‌ను తీసుకుంటారని ఒక టాక్. నిజం చెప్పాలంటే... ఇంతకు ముందు అతడి సినిమా ఒక తమన్ దగ్గరకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ చేసిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రానికి అనిరుధ్‌ను తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత అతడిని కాదని తమన్ చేత సాంగ్స్, రీ రికార్డింగ్ చేయించారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చేసిన 'అజ్ఞాతవాసి' చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. 


Also Read : హ్యాపీ బర్త్ డే విష్ణు మంచు - ప్రేమించినా సరే, ద్వేషించినా సరే ఆయన్ను మాత్రం వదల్లేరు!


కృష్ణ మరణంతో SSMB 28కి బ్రేక్!
ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా హీరోగా ఆయనకు 28వ సినిమా (SSMB 28). ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. మొన్న ఫ్యామిలీతో కలిసి మహేష్ లండన్ వెళ్లి వచ్చిన తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. నవంబర్ నెలాఖరున లేదంటే డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ పునః ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. 


మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.