దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి తన మార్క్ చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లి సందD’ సినిమాతో కలర్‌ఫుల్ ఫ్యామిలీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మహేష్‌బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. రాఘవేంద్రరావు చిత్రాలను ఇష్టపడేవారికి తప్పకుండా ఈ ట్రైలర్ నచ్చేస్తుంది. 


అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా చిత్రం తరహాలోనే ఇది కూడా ఆకట్టుకొనేలా చిత్రీకరించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో పీకేకు రోషన్ కొత్త అర్థం చెప్పాడు. పీకే అంటే పవన్ కళ్యాణ్ అని మాత్రం అనుకోవద్దు. పెళ్లి కూతురును ముద్దుగా ‘పీ.కే’ అని పిలుస్తూ.. రోషన్ ఆకట్టుకున్నాడు. ఇక రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లు ఎంత అందంగా.. గ్లామరస్‌గా కనిపిస్తారో తెలిసిందే. ఈ చిత్రంలో కూడా శ్రీలీలను దర్శకుడు ఎంతో చక్కగా చూపించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వం వహించడం గమనార్హం. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. 


‘పెళ్లి సందD’ ట్రైలర్: 


Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో


దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. పాతికేళ్ల కిందట శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ సినిమాకు సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి మళ్లీ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మరి, శ్రీకాంత్ తరహాలోనే రోషన్ ఆకట్టుకుంటాడా? హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. అయితే, ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు ఇద్దరు లేత వయస్సులో ఉన్నట్లే కనిపిస్తున్నారు. ఓవరాల్‌గా ఈ చిత్రం ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించనున్నట్లు తెలుస్తోంది. 


‘పెళ్లి సందD’ ట్రైలర్: 


‘పెళ్లి సందD’ ట్రైలర్ విడుదల చేస్తున్నా మహేష్ బాబు:


Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన


Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?


Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి