సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) ఇప్పుడు ముంబైలో ఉన్నారు. ఇటీవల మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కోసం మహేష్ యాడ్ షూట్ చేశారు. అది ముంబైలో జరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆ షూట్ చేశారు. ఆయనతో పాటు కొంత మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి భోజనం చేసినట్లు నమ్రత సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. 


దుబాయ్ వెళ్ళలేదు...
ముంబైలోనే సిట్టింగ్స్!
మహేష్, త్రివిక్రమ్ (Trivikram) కలయికలో క్లాసిక్ ఫిలిమ్స్ 'అతడు', 'ఖలేజా' వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా రూపొందుతోంది. దాని గురించి రోజుకు ఒక కొత్త గాసిప్ వినబడుతోంది. అనుకున్న విధంగా షూటింగ్ జరగడం లేదు. పైగా, బోలెడు పుకార్లు! వాటన్నిటికీ చెక్ పెట్టడానికి త్రివిక్రమ్ దుబాయ్ వెళ్తున్నారనే మాటలు వినిపించాయి. 


నమ్రతా శిరోద్కర్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టుతో మహేష్ అండ్ SSMB 28 టీమ్ దుబాయ్ వెళ్ళలేదని స్పష్టం అయ్యింది. ఆ ఫోటోల్లో త్రివిక్రమ్ అండ్ తమన్ ఉండటంతో... ముంబైలోనే డిస్కషన్స్ జరుగుతున్నాయని అర్థం అవుతోంది. ఈ మీటింగ్‌తో సినిమాపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.  






మహేష్, త్రివిక్రమ్ మధ్య కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. 


సంక్రాంతి తర్వాత నుంచి మళ్ళీ షూటింగ్! 
మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అందులో బస్ ఫైట్ తీశారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. నలభై ఐదు రోజులు పాటి ఏకధాటిగా ఆ షెడ్యూల్ జరుగుతుందని, అందులో మెజారిటీ సీన్స్ అండ్ ఫైట్స్ కంప్లీట్ చేస్తారని టాక్.  


Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?


తమన్ (Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే... అతను వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆ మధ్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అప్పుడే పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఆల్రెడీ తమన్ మూడు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. మిగతా పాటలు, నేపథ్య సంగీతం విషయంలో సిట్టింగ్స్ జరుగుతున్నాయట.   


మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.