పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన నమ్రత
మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసి వెంటనే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పట్టాభి ఇంటికి వెళ్లారు. పట్టాభి తండ్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఫోన్ లో పరామర్శించిన మహేష్ బాబు
ప్రస్తుతం మహేష్ బాబు స్పెయిన్ వెళ్లారు. SSMB28కి సంబంధించి షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో పట్టాభిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మహేష్ లేకపోవడంతో మహేష్ భార్య నమ్రత పట్టాభి ఇంటికి వెళ్లి పట్టాభి తండ్రికి నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులని ఓదార్చారు. నమ్రత పట్టాభి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహేష్ కుటుంబంతో పట్టాభికి ప్రత్యేక అనుబంధం
మహేష్ బాబు దగ్గర పట్టాభి ఎప్పటి నుంచో పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. దాదాపు మహేష్ సినిమాలన్నింటికీ పట్టాభి పర్సనల్ మేకప్ మెన్ గా చేశారు. ఆయనకు మహేష్ బాబు ఫ్యామిలితో ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్ బాబు పట్టాభిని సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తాడు. చాలాసార్లు పట్టాభి గురించి మీడియాతో చెప్పారు. సోషల్ మీడియాలోనూ ఆయన గురించి పోస్టులు పెట్టేవారు. పట్టాభి పిల్లల చదువులకు కూడా సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభి తండ్రి చనిపోవడంతో మహేష్ ఇంట్లోనూ విషాదం నెలకొంది.
తమ దగ్గర పని చేసే వారిని సొంత మనుషుల్లా చూసుకుంటున్న మహేష్ దంపతులు
మహేష్ దంపతులు తమ దగ్గర పని చేసే వారిని కూడా సొంత మనుషుల్లాగే చూసుకుంటారు. వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటున్నారు. తమ మంచి మనసును చాటుకుంటున్నారు. అటు ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్ చేయించి ప్రాణదానం చేశారు. అంతేకాదు, పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికసాయం కూడా చేస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవలోనూ మహేష్ కు నమ్రత వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
Read Also: ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..