Canada Airspace:
కెనడా గగనతలంలోనూ ఓ అనుమానాస్పద వస్తువు చక్కర్లు కొట్టడం సంచలనమైంది. ఇప్పటికే అమెరికాలో చైనా స్పై బెలూన్‌తో పాటు ఓ
అనుమానాస్పద వస్తువు అలజడి సృష్టించింది. వాటిని విజయవంతంగా పేల్చేసింది అగ్రరాజ్యం. ఇప్పుడు కెనడాలోనూ అదే తరహాలో ఓ వస్తువుని గుర్తించిన అమెరికా...వెంటనే పేల్చేసింది. ఉత్తర కెనడా గగనతలంలో ఇది చక్కర్లు కొట్టగా..అమెరికా ఫైటర్ జెట్‌లు దాన్ని పేల్చేశాయి. అంతకు ముందు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు.
"కెనడా ఎయిర్ స్పేస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వస్తువుని పేల్చివేయాలని ఆదేశాలిచ్చాను. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం. నార్త్ అమెరిక్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్...ఈ వస్తువుని విజయవంతంగా పేల్చేసింది"
జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని