Kalaavathi Song Releasing Today: మహేష్ - కీర్తీల 'కళావతి' సాంగ్ రిలీజ్ ఈ రోజే! లీక్ కావడంతో ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట' టీమ్

Sarkaru Vaari Paata - Kalaavathi Song Release: 'సర్కారు వారి పాట' సినిమాలో 'కళావతి' సాంగ్‌ను ఈ రోజే విడుదల చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ప్రకటించింది. సాంగ్ లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు

Continues below advertisement

Kalaavathi Song Releasing Today: సూపర్ స్టార్ మహేష్ బాబు (#MaheshBabu) అభిమానులకు గుడ్ న్యూస్! ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) లో 'కళావతి...' సాంగ్‌ను ఈ రోజే అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల కానుంది. నిజం చెప్పాలంటే, ప్రేమికుల దినోత్సవం కానుకగా రేపు (ఫిబ్రవరి 14న) సాంగ్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే... ఎవరో ఆ పాటను లీక్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సాంగ్ చక్కర్లు కొడుతోంది. అందుకని, అనుకున్న తేదీ కంటే ఒక్క రోజు ముందుగా (ఫిబ్రవరి 13న) పాటను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Continues below advertisement

'కళావతి...' సాంగ్ (#KalaavathiSong) లీక్ కావడంతో సంగీత దర్శకుడు తమన్ ఆవేదన చెందారు. గుండె తరుక్కుపోతోందంటూ (Thaman Heart Broken) ఓ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. ఈ రోజు ఎన్నింటికి విడుదల చేస్తానేది మరికాసేపట్లో చెప్పనున్నారు. సాంగ్ రిలీజ్ కోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. 

Also Read: మహేష్ సిగ్నేచర్ స్టెప్ అదిరిందంటున్న ఫ్యాన్స్, 'కళావతి' సాంగ్ లీక్

మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ (#KeerthiSuresh) కథానాయికగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల (Sarkaru Vaari Paata Release On May 12, 2022) కానున్న సంగతి తెలిసిందే. 'వెన్నెల' కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, సంగీతం: తమన్.

Also Read: పరువు తీశావయ్యా చిరంజీవి, జ‌గ‌న్‌ను అడుక్కోవాలా? తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

 

Continues below advertisement
Sponsored Links by Taboola