Eye Health Checkup : శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్‌ను నిర్వహించారు. ఈ ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచిత సేవలు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్‌లకు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్న ‘మా’ సభ్యులకు అభినందనలు తెలిపారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. రమణి గారు ఐ హెల్త్ క్యాంప్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తున్నారని వెల్లడించారు. భారతదేశం అంతటా ఫ్రీగా ఐ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఫీనిక్స్ సంస్థ, శంకర హాస్పిటల్స్ కలిసి ఎందరికో కంటి చూపు సమస్యలను దూరం చేసిందంటూ మంచు విష్ణు తెలిపారు. 


ఫినిక్స్ సంస్థ నుంచి చుక్కపల్లి సురేశ్, చుక్కపల్లి అవినాష్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు మాదాల రవి. శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయంగా చెప్తున్నారు. ఫీనిక్స్ సంస్థ నుంచి సహకారం అందించిన నీలేష్ జానీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులందరికీ ఫ్రీ చెకప్ చేసిన అందరికీ థ్యాంక్స్ తెలిపారు. 


కంటి సమస్యల గురించి అందరూ పట్టించుకోవాలని.. దానిని విస్మరించవద్దని శివబాలజీ తెలిపారు. అందరూ కంటి సమస్యలను పెద్దగా పట్టించుకోరు.. కానీ మా సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్ చేయించడం ఆనందంగా ఉందని వెల్లిడించారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి ఫ్రీ ఆపరేషన్స్ చేయించారని.. ఇది చాలా గొప్పవిషయమన్నారు. ఇప్పుడు ఈ సంస్థ సేవల గురించి మేము ఫ్రీగా ప్రచారం చేస్తామన్నారు. 


బ్లైండ్ నెస్‌ను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫీనిక్స్ సంస్థ డైరక్టర్ నీలేష్ జానీ తెలిపారు. ‘మా’తో అసోసియేట్ అయితే.. ప్రజలకు మేము మరింత దగ్గరవుతామని భావిస్తున్నట్లు తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే వాటిని గుర్తించి సమస్యలను దూరం చేసుకోవాలని శంకర హాస్పిటల్ హెడ్ విశ్వ మోహన్ తెలిపారు. ఫ్యూచర్లో కూడా తమ సేవలు కొనసాగిస్తామన్నారు. 



Also Read :  టెన్షన్ తగ్గించుకోండి లేదంటే హార్ట్ ఎటాక్స్ తప్పవట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు ఇవే