మరికొన్ని గంటల్లో 'మా' ఎలెక్షన్స్ జరగబోతున్నాయి. ఇంతలో మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తోన్న సీనియర్ నటుడు, మాజీ 'మా' అధ్యక్షుడు నరేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏం మాట్లాడారంటే.. ''మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయకుండా.. ఒక భరోసాతో డబ్బు మమ్మల్ని గెలిపిస్తుందని 'మా' సభ్యులను లోబరుచుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను.. డబ్బులిస్తే తీసుకోండి ఎందుకంటే వీళ్ల దగ్గర నుంచి డబ్బులు రావు. నేను కరోనా టైమ్ లో పదివేలు పంచితే.. దానికి చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎలెక్షన్ కోసం డబ్బులు పంచుతున్నారు. డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మీ మనసుకి నచ్చినవారికి వేయండి. విష్ణు ప్యానెల్ కి వేయండి.. నేను అంతకంటే కోరను. ఈ ఎలెక్షన్ కి ఇదే నా లాస్ట్ వీడియో అనుకుంటాను. అందరం కలుసుకుందాం.. ఓటేద్దాం.. నేను అబద్దాలు ఆడను, తప్పులు చెప్పను. నాకొచ్చిన వార్తను మీకు చెప్తున్నా అంతే'' అంటూ నరేష్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 

 


 

దీనికి కౌంటర్ గా శ్రీకాంత్ మరో వీడియో వదిలారు. ''నరేష్ గారు ఇంకా ఎందుకండీ అబద్దాలు ఆడతారు. ఇక్కడితో ఆపేయండి సార్.. సభ్యులందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. వాళ్లు చేసే పని మా మీద  రుద్దుతున్నారు. ఇలాంటి కల్చరస్ పనులు మేం చేయం. మేం మందు పార్టీ ఇవ్వలేదు. డబ్బులు పంచలేదు. ఏం అనుకుంటున్నారు నరేష్ అసలు మీరు..? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను నాశనం చేయడానికే ఉన్నారా మీరు..? ఆలోచించుకోండి.. మైండ్ కొంచెం పెట్టండి. రేపు ఎలెక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు వీడియో పెడతారా..? మేం డబ్బులు పంచామని..? డబ్బులు పంచింది మీరు.. అంటే ఇంకా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారా...? లాస్ట్ టైం చేసినట్లు. అసోసియేషన్ లో డబ్బులు మొత్తం దొబ్బాయ్.. అంటే ఇప్పుడు నాకు అర్ధమైందేంటంటే.. ఈరోజు మీరు డబ్బులు ఎవరి ద్వారానో ఇస్తారు.. వాళ్లు పట్టుకోగానే.. మాకు ప్రకాష్ రాజ్ పంపించేశాడు అని చెప్పడానికా మీరు చేసేది..? ముందస్తు రాజకీయమా ఇది..? దయచేసి మెంబర్స్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రలోభాలకు లొంగొద్దని ఇదివరకు కూడా చెప్పాను. ఇలాంటివి చాలా జరుగుతాయి.. ప్లీజ్ దయచేసి అర్ధం చేసుకోండి'' అంటూ మాట్లాడారు. 








Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి