తన భర్తను తనకు కాకుండా చేస్తున్నారంటూ నెల్లూరులో ఓ యువతి ఆందోళనకు దిగింది. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రాంతంలోని భర్త అపార్ట్ మెంట్ ముందు బైఠాయించింది. అత్త, మామ లోపలే ఉండి తనను ఇంట్లోకి రానివ్వడంలేదని ఆమె ఆరోపించింది. 2010 డిసెంబర్లో చిట్టమూరు పవన్ కుమార్, స్రవంతికి పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరికీ విభేదాలొచ్చాయి. ఈ క్రమంలో పోలీస్ కేసులు, విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తోంది. అయితే ఆ తర్వాత తన భర్త తనకు కావాలంటూ స్రవంతి అత్తగారింటికి వచ్చింది. ఈ క్రమంలో ముందుగా పోలీసులకు సమాచారమిచ్చిన అత్త, మామ.. ఆమెను లోపలికి రానివ్వలేదు. కోర్టులో విడాకుల కేసు ఉండటంతో ప్రస్తుతానికి గొడవలు వద్దని, స్రవంతిని అక్కడినుంచి పంపించేశారు పోలీసులు. అయితే కొంతసేపు అత్తగారింటి ముందు కోడలు స్రవంతి తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.




Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..


విడాకుల నోటీసులు పంపి అమెరికాకు పయనం


తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది యువతి. పెళ్లైన ఏడాదిన్నర నుంచే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. భర్త విడాకులు నోటీసులు పంపి అమెరికాకు వెల్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. తన భర్త అమెరికా నుంచి తిరిగి నెల్లూరుకు వచ్చాడన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త ఇంటి వద్దకు వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నెల్లూరులో జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన పవన్‌కు, శ్రవంతికి 2010లో వివాహం జరిగింది. ఏడాదిన్నర వరకు వీరి కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాత వివాదాలు మొదలయ్యాయి. భార్య స్రవంతిని పవన్ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో స్రవంతి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత స్రవంతికి విడాకుల నోటీసులు పంపి పవన్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఇటీవల పవన్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్రవంతి పవన్ ఇంటికి వెళ్లింది. ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా పవన్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు స్రవంతి బైఠాయించింది. 


Also Read: ఆ ఊరు ప్రెసిడెంట్ బెట్టింగ్ బాబు.. సొంత ఇంటిలోనే క్రికెట్ బెట్టింగ్.... చివరికి సీన్ రివర్స్...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి