మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో వాడీవేడి వాతావరణం నెలకొంది. ఒక వైపు మంచు విష్ణు పెద్ద హీరోల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు ప్రకాష్ రాజ్ ఏకంగా సభ్యులతో విందు రాజకీయాలకు తెరతీశారు. మొన్నటి వరకు పరస్పర ఆరోపణలతో హీట్ పెంచిన విష్ణు, ప్రకాష్ రాజ్‌లు మాటలు కట్టిపెట్టి.. సభ్యుల మద్దతు కూడగట్టుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మంచు విష్ణు ఆదివారం నందమూరి బాలకృష్ణను కలిశారు. ‘అఖండ’ షూటింగులో బిజీగా ఉన్న బాలయ్యకు తమ ప్యానెల్ మ్యానిపేస్టో వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనకు మద్దతు తెలిపారని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నట సింహం బాలా అన్నా.. మీ మద్దతుకు ధన్యవాదాలు. మా ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలవడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 


మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా ప్రచారం జోరు పెంచారు. ఎన్నికల్లో విజయం కోసం ఆయన ‘మా’ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందరికీ లంచ్ పార్టీ ఇచ్చారు. ‘మా’ సంక్షేమం కోసం తాను చేపట్టబోయే పనుల కోసం వారికి వివరించారు. అవన్నీ జరగాలంటే.. ఎన్నికల్లో మీ మద్దతు తప్పకుండా కావాలని సభ్యులను కోరారు. సభ్యులు ఇంకా ఏయే సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియజేప్పాలని ప్రకాష్ రాజ్ కోరారు. 






ఇటీవల సీనియర్ నటుడు నరేష్.. మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.  అధ్యక్షుడి పదవిలో తెలుగువాడే ఉండాలని, మంచు విష్ణు మాత్రమే కళాకారులకు న్యాయం చేయగలడని నరేష్ పేర్కొన్నారు. ఇక్కడ సరైన నటులు లేరు కాబట్టి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారని, ఆ మాటలు తనని బాధించాయని నరేష్ అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానటుల రక్తం మనలో లేదా? నరేష్ ప్రశ్నలు సంధించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘నరేష్ నేను చెప్పని మాటలను చెప్పి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. నరేష్ అబద్దాలు చెప్పకండి. అసత్య ప్రచారాలను మానుకొని.. ‘మా’కు మీరు ఏం చేశారు? ఏం చేయబోతున్నారో చెప్పండి. 25 సంవత్సరాల నుంచి నేను ‘మా’లో సభ్యుడిని. రెండు మూడు సార్లు మాత్రమే ఓటు వేయలేదు. నన్ను నాన్ లోకల్ అంటున్న మనిషికి సిగ్గుండాలి. మనిషి జన్మంటేనే ఒక చోటు నుంచి మరోచోటుకు వెళ్లడం. నాన్ లోకల్ అనే అభ్యంతరం ఉంటే సభ్యుడిగా చేర్చుకోకూడదు. చట్టంలో కూడా నాన్ లోకల్ పోటీ చేయకూడదని లేదు. ఇది ప్రజాస్వామ్యం.. 900 మంది డిసైడ్ చేస్తారు. మీరు ఎంత వాగినా వారే నిర్ణయిస్తారు. నేను రెండు నేషనల్ అవార్డులు తెచ్చారు. వీరు ఎవరైనా తెచ్చారా? తెలుగు సినిమా గర్వించే పని చేశాను. తెలుగు సాహిత్యం మీద ఏ చర్చ పెట్టినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. 


Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి