టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్స్ గా ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి సరైన హిట్టు పడలేదు. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేశ రూపొందించిన 'శతమానం భవతి' సినిమాతో భారీ విజయం అందుకున్న శర్వా.. ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. 'పడి పడి లేచే మనసు', 'శ్రీకారం', 'జాను', 'రణరంగం', 'మహాసముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఇలా వరుసగా ప్లాప్ సినిమాల్లో నటించారు. 

 

ప్రస్తుతం ఆయన నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

 

ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. కానీ ఈ సినిమాకి సరైన బజ్ రావడం లేదు. ప్రమోషన్స్ విషయంలో చిత్రబృందం పెద్దగా యాక్టివ్ గా లేదు. ఆ కారణంగానే సినిమాకి బజ్ రావడం లేదనిపిస్తుంది. బహుశా రిలీజ్ కి ముందు ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నారో ఏమో కానీ.. ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయాల్సింది. 

 

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆయన ప్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. లేదంటే మాత్రం ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడడం ఖాయం. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

శర్వా సినిమాలో కార్తీ పాట:
 
ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిన్నపిల్లలంతా కలిసి కోరస్ పాడుతుంటారు. లీడ్ సింగర్ ఎవరని చర్చకి రాగా.. ఓ స్టార్ హీరో అని చెబుతారు. దీంతో వారంతా ఎవరై ఉంటారా..? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి ముందు బకెట్ తో బిరియాని తీసుకొచ్చి పెడతారు. సింబాలిక్ గా హీరో కార్తీ అని చెప్పకనే చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లో 'ఖైదీ' మ్యూజిక్ కూడా వినిపించింది.

 

అంటే శర్వానంద్ కోసం కార్తీ పాట పాడడానికి రెడీ అయ్యారన్నమాట. ఇదివరకు కూడా కార్తీ పాటలు పాడారు. తమిళంలో ఆయన నటించిన 'శకుని', 'బిరియాని' సినిమాల్లో సాంగ్స్ పాడారు కార్తీ. ఇప్పుడు వేరే హీరో సినిమాలో పాడబోతున్నారు.