Stock Market: ఈ వారంలో BSE500తో కేవలం 0.34 శాతం పెరిగి, 24,232 వద్ద ముగిసింది. బ్రాడర్‌ మార్కెట్ కన్సాలిడేట్‌ అయినప్పటికీ, BSE500లోని 14 కౌంటర్లు మాత్రం తమ పెట్టుబడిదారులకు రెండంకెల రాబడిని అందించాయి. 


ఈ 14 పేర్ల ప్యాక్‌లో టాటా టెలీ సర్వీసెస్‌ ముందుంది. క్రితం వారంలోని రూ.93.85 నుంచి 43.63 శాతం పెరిగి రూ.134.80కి చేరుకుంది, BSE500 టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ కనీసం గత 15 త్రైమాసికాలుగా నష్టాల్లోనే ఉన్నా, ఇన్వెస్టర్లు మాత్రం ఈ స్క్రిప్‌ని వదిలి పెట్టడం లేదు. పేరెంట్‌ కంపెనీ నుంచి నిరంతర లిక్విడిటీ సపోర్ట్‌, SME సెగ్మెంట్‌ మీద దృష్టి పెట్టడం, ఇతర టాటా గ్రూప్ కంపెనీలతో చక్కటి సహకారం, సాస్‌ (SaaS)+కనెక్టివిటీ సొల్యూషన్ ప్రొవైడర్‌గా మారడం వంటివి టాటా టెలిసర్వీసెస్‌కు అనుకూలంగా పని చేస్తున్న అంశాలు. 


పాలీ మెడిక్యూర్ షేరు ఈ వారంలో 18.98 శాతం జంప్ చేసి రూ.755.85 నుంచి రూ.899.30కి చేరుకోగా; EIH రూ.160.95 నుంచి రూ.187.95కి 16.78 శాతం పెరిగింది. TCNS క్లోతింగ్ కూడా 14.50 శాతం లాభంతో రూ.579.50 నుంచి రూ.663.50కి జూమ్‌ అయింది.


వరోక్ ఇంజినీరింగ్ 13.45 శాతం వృద్ధితో రూ.335.40 నుంచి రూ.380.50కి ఎగబాకింది. ఈ నెల 29న ఈ కంపెనీ ఏజీఎం ఉంది.


HLE గ్లాస్‌కోట్, ఎస్కార్ట్స్ కుబోటా, పీసీబీఎల్, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, RHI మాగ్నెసిటా ఇండియా, పతంజలి ఫుడ్స్ 12-13 శాతం వరకు ర్యాలీ చేశాయి. ఎస్కార్ట్స్ కుబోటా, ఆగస్టులో 6,111 ట్రాక్టర్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.


Q1లో బ్రహ్మాండమైన ఫలితాలను నివేదించినప్పటి నుంచి మజాగన్ డాక్ షిప్‌బిల్డర్స్ స్టాక్ వార్తల్లో ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం 134 శాతంతో (YoY) రూ.217 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం 84 శాతం వృద్ధితో రూ.2,230 కోట్లకు పెరిగింది.


వ్యాపార అవకాశాల మీద పెరిగిన అంచనాల మధ్య పతంజలి ఫుడ్ ఈ వారంలో లాభపడింది. యాంటిక్ సెక్యూరిటీస్ ఈ షేరు మీద రూ.1,725 ​టార్గెట్ ప్రైస్‌తో కవరేజీని ప్రారంభించింది. ఇది, ఇంకా 45 శాతం వరకు పెరుగుదలను సూచిస్తోంది.


KRBL, వైభవ్ గ్లోబల్, స్వాన్ ఎనర్జీ సహా మరికొన్ని పేర్లు ఈ వారంలో 10-12 శాతం లాభపడ్డాయి.


నష్టపోయిన కౌంటర్ల విషయానికి వస్తే... దీపక్ ఫెర్టిలైజర్స్ 9.58 శాతం; రూట్ మొబైల్ 7.9 శాతం; డా.లాల్ పాత్‌లాబ్స్ 7.7 శాతం; టాటా ఎల్‌క్సీ 6.8 శాతం; యూఫ్లెక్స్ 6.55 శాతం క్షీణతతో BSE500 ఇండెక్స్‌లో చెత్త ప్రదర్శన చేశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.