One-Word Tweet Trend:


సచిన్ నుంచి బైడెన్ వరకూ..


సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. ఎవరో స్టార్ట్ చేస్తే...దానే అందరూ ఫాలో అయిపోతారు. ఇప్పుడు ట్విటర్‌లో అదే నడుస్తోంది. ప్రస్తుతం ట్విటర్‌లో One Word Trend మొదలైంది. ఉన్నట్టుండి కేజీఎఫ్‌, సలార్ ట్విటర్ హ్యాండిల్ పేజెస్ సింపుల్‌గా "Monster", "Voilent" అని ట్వీట్‌లు చేశాయి. ఫ్యాన్స్ ఏంటిది అని కన్‌ఫ్యూజ్ అయ్యారు. కొందరు మీమ్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ రెండు పేజెస్ మాత్రమే కాదు. సెలెబ్రెటీలు కూడా ఇదే ట్రెండ్ మొదలు పెట్టారు. లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరకూ అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోయారు. సచిన్ "cricket" అని ట్వీట్ చేయగా...జో బైడెన్ "democracy" అని ట్వీట్ చేశారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA కూడా "Universe" అని ట్వీట్ చేసింది. 














కొన్ని కంపెనీలు కూడా..


ఇక కొన్ని సంస్థలు కూడా ఇదే ట్రెండ్‌ని కొనసాగించాయి. డామినోస్ పిజ్జా ట్విటర్ హ్యాండిల్‌ "pineapple" అని ట్వీట్ చేసింది. స్టార్‌బక్స్ కంపెనీ సింపుల్‌గా "Coffee" అని ట్వీట్ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ Micro Gravity అని ట్వీట్ చేసింది. గూగుల్ మ్యాప్స్ Maps అని, జియో ఏమో True 5G, వాషింగ్టన్ పోస్ట్ News అని, CNN అయితే Breaking News అని ఇలా రకరకాలుగా వన్ వర్డ్ ట్వీట్స్ చేస్తున్నాయి. అసలు ఈ ట్రెండ్ ఎలా మొదలైందని ఆరా తీస్తే...National Railroad Passenger Corporation అలియాస్ Amtrak అనే కంపెనీ ఈ One Word Trend ని స్టార్ట్ చేసినట్టు తేలింది. Amtrak ట్విటర్ హ్యాండిల్‌లో "Trains" అనే సింగిల్ వర్డ్‌ని పోస్ట్ చేసింది. ఆ తరవాత ఇదే ట్రెండ్‌ అనుసరించారు. 










త్వరలోనే ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్..? 


ట్విటర్‌లో ఎప్పటి నుంచో Edit ఆప్షన్ రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ ఈ ఆప్షన్‌ను యూజర్స్‌కు అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒకసారి ట్వీట్ చేసిన తరవాత వెంటనే అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే...Edit ఆప్షన్‌ని వినియోగించుకునే విధంగా రూపొందిస్తోంది. అయితే...దీనికి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్ కొనసాగుతోందని ట్విటర్ వెల్లడించింది. కొద్ది వారాల్లోనే Twitter Blue subscribersకి కూడా ఈ టెస్టింగ్‌ ఎక్స్‌పాండ్ చేస్తామని పేర్కొంది. ఓ ట్వీట్ చేసిన తరవాత దాదాపు 30 నిముషాల వరకూ Edit Tweet అనే ఆప్షన్ కనిపించేలా టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది. అంటే..ఏం ఎడిట్ చేయాలన్నా ఈ అరగంటలోనే చేసేయాలన్నమాట. ఈ ఎడిటెడ్ ట్వీట్స్‌..ప్రత్యేక ఐకాన్‌తో కనిపించనున్నాయి. ఒరిజినల్ ట్వీట్‌ను మాడిఫై చేశారని యూజర్స్‌ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేందుకు ఇలాంటి ఆప్షన్ పెట్టనున్నట్టు ట్విటర్ తెలిపింది.