Love Me Movie Stupid Heart Lyrical Song: యంగ్ హీరో ఆశిష్, ‘బేబీ‘ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ‘. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.


ఆకట్టుకుంటున్న ‘స్టుపిడ్ హార్ట్’ మెలోడీ సాంగ్


‘లవ్ మీ’ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ‘స్టుపిడ్ హర్ట్’ అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా అనిపిస్తోంది. అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసే ఈ పాట వినసొపంతుగా అలరిస్తోంది. ఈ పాటకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. సాయి శ్రేయ అద్భుతంగా పాడారు.



మే 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల


‘లవ్ మీ’ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం కారణంగా వాయిదా పడింది. మే 25, 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా హారర్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఓ యువకుడు దెయ్యాన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాకు పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ  చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా ‘బేబీ‘ మూవీ మాదిరిగానే మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ ఆకాంక్షిస్తున్నారు.  


'రౌడీ బాయ్స్' ఆశిష్, ‘బేబీ‘తో వైష్ణవి సినీ ఎంట్రీ 


'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడి కుమారుడు, శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘సెల్ఫీష్’ అనే సినిమా మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, ఇప్పుడు ‘లవ్ మీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది వైష్ణవి చైతన్య. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘లవ్ మీ’లో ఆశిష్ తో జోడీ కడుతోంది. వీరిద్దరు జంటగా వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలో విడుదలకానున్న ‘లవ్ మీ’ ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Read Also: నా బాడీ షేపులు అలా ఉండాలనేవారు, కావాలనే పుకార్లు పుట్టించేవారు - నిర్మాతలపై సోనాలీ బింద్రే కామెంట్స్