డీసీ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘ది ఫ్లాష్’ గురువారం థియేటర్లలో విడుదల అయింది. టైమ్ ట్రావెల్, మల్టీవర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సూపర్ హీరో సినిమా ఇదేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ సినిమాకు భారతీయతతో ఉన్న కనెక్షన్ ఇంటర్నెట్‌లో ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమాలోని ఒక సన్నివేశంలో ‘ది ఫ్లాష్’ టైటిల్ రోల్ పోషించిన ఎజ్రా మిల్లర్ రూమ్‌లో గోడ మీద ఆంజనేయుడి చిత్రపటం చూడవచ్చు. దీన్ని ఇంటర్నెట్‌లో ఇప్పుడు విపరీతంగా షేర్ చేస్తున్నారు.