పాన్ ఇండియా హీరో ప్రభాస్ - ఓం రౌత్ ల మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ముందు నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సౌత్ తో పాటు నార్త్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే ఆదిపురుష్ మూవీ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అయితే ఆదిపురుష్ మూవీకి సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 'ఆర్ ఆర్ ఆర్' హిందీ డే వన్ కలెక్షన్స్ ని దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి మొదటిరోజు సుమారు రూ.19 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఆదిపురుష్ విషయానికొస్తే ఈరోజు రాత్రికి తొమ్మిది గంటల వరకు ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.18 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆదిపురుష్ మూవీ త్రిబుల్ ఆర్ హిందీ డే వన్ నెట్ కలెక్షన్స్ ని చేరుకుంది. ఇంకా అర్ధరాత్రి, ఎర్లీ మార్నింగ్ షోలతో కలుపుకుంటే 'ఆదిపురుష్' చాలా సులభంగా 'ఆర్ ఆర్ ఆర్' హిందీ డే వన్ నెట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా హిందీలో ఆదిపురుష్ మూవీ మొదటి రోజు సుమారు రూ.35 కోట్ల కు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' డే వన్ టోటల్ కలెక్షన్స్ తో పోల్చుకుంటే ,'ఆదిపురుష్' డే వన్ కలెక్షన్స్ చాలా ఎక్కువ. కాగా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వలు అనుమతిచ్చాయి.
టికెట్ రేట్లు పెరిగిన కారణంగా ఆదిపురుష్ మూవీ మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా ఇప్పటికే ఈ సినిమాని వీక్షించిన ప్రేక్షకుల నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది ఏమో సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ నటన, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, వి ఎఫ్ ఎక్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని చెబుతుంటే.. మరి కొంత మంది మాత్రం వి ఎఫ్ ఎక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని, సినిమా ఎక్కువగా డార్క్ థీమ్ లో ఉందని, సెకండాఫ్ నిరాశపరిచిందని చెప్తున్నారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టీసీరీస్ బ్యానర్ పై బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ త్రీడి టెక్నాలజీ తో రూపొందిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ - అతుల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
Also Read: నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!