చ్చ తెలుగు అమ్మాయి, హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ ఆరంభంలో తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన అంజలి తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో సీత పాత్రలో ఎంతో అమాయకంగా నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగులో కొందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఈ గత కొంతకాలంగా అంజలికి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ తన కెరీర్ ని చక్కగా బిల్డ్ చేసుకుంటుంది. ప్రస్తుతం అంజలికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సాలిడ్ మార్కెట్ ఉంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వెబ్ సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటున్న అంజలి తాజాగా మరో వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


అంజలి ప్రస్తుతం 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5 లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ని నూతన దర్శకుడు ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు అంజలి పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఒక్కసారిగా వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచే విధంగా చెప్పొచ్చు. ఒకసారి ఈ పోస్టర్ ని గమనిస్తే.. ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్న పక్కా పల్లెటూరి అమ్మాయిలా అంజలి కనిపించింది. అంతేకాదు ఇదే పోస్టర్లో అంజలి ముందు ఒక కంచె కూడా చూపించారు. ఆ కంచెను అంజలి ఎలా దాటింది అనే విషయాన్ని ఈ పోస్టర్లో దర్శకుడు ముఖేష్ ప్రజాపతి చూపించే ప్రయత్నం చేశాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ పోస్టర్లో అంజలి లుక్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అయితే దీనికంటే ముందు గత ఏడాది విడుదల చేసిన పోస్టర్లో అంజలి గ్లామర్ లుక్‌తో అదరగొట్టింది. ఈ రెండు పోస్టర్లలో అంజలి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తోంది. ఓ పోస్టర్లో గ్లామర్ గా మరో పోస్టర్లో హోమ్లీగా కనిపించడంతో ఈ వెబ్ సిరీస్ లో అంజలి 2 వేరియేషన్స్ ఉన్న రోల్స్ లో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన 'బహిష్కరణ' పోస్టర్ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ జూలై నెలలో ప్రేక్షకులముందుకు రానుంది.


అంజలికి 'గేమ్ చేంజర్' మూవీ టీమ్ కూడా సర్‌ప్రైజ్ ఇచ్చింది. బర్త్‌ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీలో అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అంజలి బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆమెకు విషెస్ తెలియజేశారు. ఈ పోస్టర్లో అంజలి బ్లాక్ సూట్ ధరించి ఫైల్స్ చేతిలో పట్టుకొని పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ని బట్టి చూస్తే అంజలి ఈ మూవీలో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టు తో పాటు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది అంజలి. తాజాగా ఈ మూవీ టీం కూడా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అంజలి రత్నమాల అనే పాత్రలో కనిపించునుంది.