తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ సృష్టించిన ఒరవడి అంతా ఇంతా కాదు. ఆయన లాంటి హీరో తెలుగులో రాలేదు. బహుశ ఇక ముందు కూడా రాలేరని చెప్పుకోవచ్చు. నటనకే కొత్త పాఠాలు నేర్పిన హీరో ఆయన. తను నటించిన ఎన్నో సినిమాలు అద్భుత రికార్డులను సెట్ చేసి పెట్టాయి. తెలుగు సినిమాలను మాత్రమే కాదు, హిందీలో సూపర్ హిట్ సాధించిన పలు సినిమాలను తెలుగులోకి రీమేక్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పలు హిట్ సినిమాలను ఎన్టీఆర్ తెలుగులోకి రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ రోజు అమితాబ్ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ రీమేక్ చేసిన ఆయన చిత్రలేమిటో చూసేద్దామా!


జంజీర్-నిప్పులాంటి మనిషి


బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘జంజీర్’ను ఎన్టీఆర్ తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’ పేరుతో రీమేక్ చేశారు. తన  52వ ఏట ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు. బిగ్ బీ ‘జంజీర్’ సినిమాలో నటించే నాటికి కేవలం 32 ఏండ్లు. ఈ సినిమాతో అమితాబ్ కు బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించారు. తెలుగులో ఎన్టీఆర్‌కు సైతం ఈ సినిమా మంచి హిట్ అందించింది.   


దో అంజానే- మా వారి మంచితనం


అమితాబ్ నటించిన మరో సూపర్ హిట్ సినిమా ‘దో అంజానే’. ఈ సినిమాను ఎన్టీఆర్ ‘మా వారి మంచితనం’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా హిందీ సినీ పరిశ్రమతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.


దీవార్- మగాడు


బిగ్ బీ బాలీవుడ్ లో నటించిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ‘దీవార్’. దీనిని తెలుగులో  ‘మగాడు’ పేరుతో ఎన్టీఆర్ రీమేక్ చేశారు. తెలుగు నాట ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.  


డాన్- యుగంధర్


బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కు ఓ రేంజిలో గుర్తింపు తెచ్చిన సినిమా ‘డాన్’. ఈ సినిమాతో బిగ్ బీ కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘యుగంధర్’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యింది. చాలా చోట్ల మంచి విజయాన్నే అందుకుంది.


హేరాఫేరి- రామకృష్ణులు


అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా కలిసి నటించిన సూపర్ డూపర్ మల్టీ స్టారర్ సినిమా ‘హేరాఫేరి’. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘రామకృష్ణులు’ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ తో కలిసి ఏఎన్నార్ నటించారు. ఈ సినిమా టాలీవుడ్ లోనూ ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది.


సుహాగ్-సత్యం శివం


తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన మరో సినిమా ‘సత్యం శివం’. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సైతం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, శశి కపూర్ కలిసి నటించి సుహాగ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.   


లావారిస్- నా దేశం


అమితాబ్ కెరీర్ లోనే అద్భుత సినిమా ‘లావారిస్’. బాలీవుడ్ లో ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఎన్టీఆర్ ‘నా దేశం’ పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు.


Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?


Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్