గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 11th Today Episode 578)


జగతి పేషెంట్ గా బెడ్ పై ఉంటుంది. వసుధారని తీసుకుని వస్తాడు రిషి. జగతి-వసు మాటలన్నీ బయటి నుంచి రిషి వింటాడు. అది గమనించిన వసుధార మేడం మీరు తాగుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళుతుంది. 
రిషి: ఎలా ఉంది మేడం
వసు: అలాగే ఉంది..డాక్టర్ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాడు..మనసుకి కాదు
రిషి: జాగ్రత్తగా చూసుకో వసుధారా అనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
లోపలకు వెళ్లిన వసుతో నేనిప్పుడే వస్తాను జగతి మేడంని చూసుకో అనేసి రిషి రూమ్ కి వెళతాడు మహేంద్ర..
మహేంద్ర: చాటుగా ఎందుకు..నేరుగా రావొచ్చు కదా
రిషి: డాక్టర్ ఏమన్నారు..స్పెషలిస్టుని పిలిపించండి..ఎక్కడినుంచైనా డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించండి..
మహేంద్ర: జగతికి కావాల్సింది మానసిక ప్రశాంతంత..తను అన్నింటా గెలిచింది కానీ తల్లిగా ఓడిపోతోంది..తనని గెలిపించాలని ప్రయత్నిస్తున్నాను..గెలుస్తుంది కదా రిషి అనే వెళ్లిపోతాడు మహేంద్ర..
వంటగదిలో ఉన్న ధరణి దగ్గరకు వెళ్లిన వసుధార.. కాలు నొప్పి తగ్గిపోయిందా అని అడుగుతుంది.. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని..జగతి పరిస్థితి ఎలా ఉందో వెళ్లి చూసి వచ్చి చెప్పు అని పంపించేస్తుంది.. వసుధార కూడా వెళ్లబోతుంటే ఆగు నీతో మాట్లాడాలి అంటుంది
వసు: మా మేడం దగ్గరకు వెళ్లాలి
దేవయాని: మాట్లాడాలి అంటున్నా కదా
వసు: నాక్కొంచెం పని ఉంది తర్వాత మాట్లాడుదాం మేడం
దేవయాని: ఈ మధ్య నీకు ధైర్యం ఎక్కువైంది..ఇంత జరిగినా ఈ ఇంట్లోకి ఎలా రావాలి అనిపించింది
వసు: ఏం జరిగింది మేడం.. మీరు గురుదక్షిణ గురించి చేసినా గొడవా.. మేడం రిషి సార్ కి నాకు మధ్య ఇంతకన్నా పెద్దపెద్ద గొడవలే జరిగాయ్
దేవయాని: నువ్వు రిషిని వదిలిపెట్టవా
వసు: జీవితాంతం వదిలిపెట్టను..మీరేదో ప్రయత్నం చేశారు కానీ మా ఇద్దరి మధ్యా ఆరోగ్యకరమైన ఒప్పందం కుదిరింది
దేవయాని: రిషి రావడం చూసి..తర్వాత చెబుతాను నీ సంగతి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది
కాఫీ ఇమ్మంటారా సార్ అని అడిగితే..నేను చిన్న పనిపై బయటకు వెళుతున్నాను గౌతమ్ నిన్నుడ్రాప్ చేస్తాడు అనేసి వెళ్లిపోతాడు..


Also Read: డాక్టర్ బాబుని చూసిన వారణాసి - నిజానికి దగ్గరగా కార్తీక్, దీప ప్రాణాలు తీసేందుకు సిద్ధమైన మోనిత


అటు జగతి..నాకోసం వసుని రిషి తీసుకొచ్చాడు మహేంద్ర ఇంతకన్నా ఆనందం ఏముంది. రిషి కోపం తగ్గిందా వసుతో బాగా మాట్లాడుతున్నాడా..
మహేంద్ర: రిషి ఆలోచనలు అభిప్రాయాలు తెలిసికూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి..
జగతి: వసు-రిషిని తలుచుకుంటేనే వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నట్టు ఊహించుకుంటాను.. ఇవన్నీ ఇంత బావుంటాయో కదా.. ఊహల్లో అయినా అబద్ధాన్ని నిజం చేసుకోనీ మహేంద్ర: బయటకు ఆనందం అంటున్నావ్ కానీ నీ మాటల్లో అది గొప్ప విషాదం కదా జగతి..
అటు గౌతమ్..వసుధారను డ్రాప్ చేస్తుంటాడు... సైలెంట్ గా కూర్చున్న వసుతో..
గౌతమ్: నాకు ఈ సైలెన్స్ నచ్చదు ఏదో ఒకటి మాట్లాడు..మేడం కోలుకుంటారులే ఆలోచించకు
వసు: రిషి సార్ గురించి ఆలోచిస్తున్నా..
గౌతమ్: రిషి మూడ్ గురించి ఎవ్వరికీ తెలియదు..వాడు బాగానే ఉంటాడు..వాడి మూడ్ గురించి తలుచుకుంటూ మనం బాధఫడుతున్నాం...వాడు ఎక్కడో ప్రశాంతంగా ఉంటాడు..
అటు రిషి రోడ్డుపక్కన కారు ఆపి..వసుగురించి ఆలోచిస్తాడు. నిన్ను తీసుకురాగలను కానీ పంపించలేను ..నీకు అర్థమైనా అర్థం కాకపోయినా కోపం వచ్చినా ఇది నా మనసు..నేను ఇలాగే ఉంటాను అనుకుంటాడు...


Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని


తన రూమ్ బయట బెంచ్ పై కూర్చున్న వసుధార..రాజు,రాణి బొమ్మలతో మాట్లాడుతుంటుంది..మిమ్మల్ని రిషి సార్ దగ్గరకు పంపిస్తున్నాను అక్కడ బుద్ధిగా ఉండాలి అంటుంది. అక్కడ రిషి కూడా వసు ఆలోచనల్లోనే ఉంటాడు. తనని నేను డ్రాప్ చేయనందుకు కోపం వచ్చి ఉంటుంది కదా..క్వశ్చన్ చేయాలి కదా..కోపం వస్తే అడగొచ్చు కదా కనీసం మెసేజ్ చేయొచ్చు కదా అనుకుంటూ ఫోన్ తీసి మెసేజ్ చేస్తాడు..
రిషి: ఏం చేస్తున్నావ్ నన్ను ఏమైనా అడగాల్సింది ఉందా ...
వసు: ఒకటి అడగాలి సార్
రిషి: ఏంటో అది..
వసు: రేపు ఇంటికి రావొచ్చా..జగతి మేడంని కలవాలి..విత్ యువర్ పర్మిషన్
రిషి: ఇదా అడిగేది.. డ్రాప్ చేయలేదని అడగదా.. నువ్వొస్తే ఇక్కడ నిన్ను ఆపేది ఎవరు..ఎప్పుడైనా రావొచ్చు.. పికప్ చేసుకోమని అంటుందా ఏంటి..
వసు: మీరు పికప్ చేసుకోవద్దు..డ్రాప్ కూడా చేయొద్దు..
రిషి: ఇలా అనకపోతే నువ్వు పొగరు ఎలా అవుతావు అనుకుంటూ కాల్ చేస్తాడు..
కాల్ లిఫ్ట్ చేయకుండా..ఫోన్ చూస్తూ ఉండిపోతుంది..ఫోన్లో మాట్లాడాలి అంటే భయంగా ఉందనుకుంటుంది.. 
రిషి: ఫోన్ మాట్లాడకపోతే ఇంటికొచ్చేస్తాను
వసు: వద్దు సార్ రేపు నేనే వస్తాను..
గుడ్ నైట్ చెప్పుకుంటారు... తొందరగా తెల్లారితే వసుధార వచ్చేస్తుందని రిషి.. అటు బొమ్మలతో వసు మాట్లాడుకుంటారు...


Also Read:


తెల్లరగానే జగతి రూమ్ లో రిలాక్స్ గా కూర్చుంటుంది.. కాఫీ వాసన వస్తోంది మహేంద్ర..కాఫీ తెచ్చావా అంటూ కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా రిషి నిల్చుని ఉంటాడు. జగతి లేవబోతుంటే కాఫీ ఇస్తాడు... జగతి ఇబ్బందిగా తీసుకుంటుంది.. మంచినీళ్లు ఇస్తాడు..
జగతి: కాఫీ నువ్వు తీసుకురావడం ఏంటి
రిషి: అందరూ సమానమే..అందరూ అన్ని పనులు చేయాలని నేను నమ్ముతాను. మీ ఆరోగ్యం గురించి డాడ్ ని అడిగాను.. మీ గురించి డాడ్ టెన్షన్ పడుతున్నారు..మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి డాడ్ కోసమైనా.. డాడ్ కోసం మీరు ఆలోచించాలి..డాడ్ ని ఇబ్బంది పెట్టే విషయాలు ఏమీ జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను..మీరుకూడా జాగ్రత్త పడతారు అనుకుంటున్నాను... 80 % బాధలు మనుషుల ఆలోచన విధానం వల్ల వస్తాయి. మీరొకటి ఆలోచిస్తున్నారు అది సాధ్యమా, అసాధ్యమా అన్నది పక్కనపెడితే దానివల్ల మీతోపాటూ అందర్నీ బాధపెడుతున్నారు.. నిజానికి మీరు బాగా ఆలోచిస్తే మీ బాధకి కారణం నేనుకాదు..మీ బాధకి మీరే కారణం..ఓ పిలుపుకోసం బంధాన్ని బలిపెట్టాలని అనుకోవద్దు.. నా దృష్టిలో ఆ పిలుపు ఎప్పుడో దూరమైంది..ఆ బంధం ఎప్పుడో ఒంటరివాడిని చేసింది..మీరు పోగొట్టుకున్న పిలుపు విలువ ఎంతో తెలుసా నేను పోగొట్టుకున్న బాల్యం అంత..మీకు కావాల్సిన ప్రశాంతత నేను ఇవ్వగలను కానీ నేను పోగొట్టుకున్న బాల్యాన్ని మీరు తెచ్చివ్వగలరా..
జగతి మాట్లాడేందుకు ప్రయత్నించినా రిషి మాట్లాడనివ్వడు...
మిమ్మల్ని మారమని నేను అనడం లేదు..నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను. చిన్నప్పుడే నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాక వసు వచ్చాక జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను..ఇప్పుడు ఆ ఒక్క పిలుపుకోసం వసుతో బంధాన్ని దూరం చేయకండి. నేను మాట్లాడేమాటలు కటువుగా ఉండొచ్చు కానీ అందులో ఏ ఒక్కటీ అబద్ధం కాదు..మీ మనసు నొప్పిస్తే క్షమించండి..తల్లి ఆదరణ లేకుండా పెరిగినవాడిని కదా..దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయకండి అనేసి వెళ్లేందుకు అడుగుముందుకేస్తాడు..అక్కడ మహేంద్ర నిల్చుని ఉంటాడు..
ఎపిసోడ్ ముగిసింది..