పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు అభిమానుల్లో క్రేజ్ మాములుగా లేదు. అకీరా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించడు. అతడికి సంబంధించిన విషయాలు కూడా చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. అసలు అకీరాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందో.. లేదో.. హీరోగా ఎంట్రీ ఇస్తాడో.. లేదో అనే విషయాల్లో క్లారిటీ లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆయన్ను జూనియర్ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అకీరాకు సంబంధించిన ఫోటోలేమైనా బయటకు వస్తే ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
ఆరున్నర అడుగుల అకీరాను చూసుకొని మురిసిపోతుంటారు అభిమానులు. రేణుదేశాయ్ కి కూడా కొడుకు అంటే పిచ్చి ప్రేమ. అప్పుడప్పుడు అకీరాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొడుకుపై ప్రేమను చాటుకుంటుంది. అకీరాకు బుక్స్ చదవడం, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని ఇప్పటికే రేణుదేశాయ్ ఓ సందర్భంలో చెప్పింది. తాజాగా అకీరాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్.
Also Read : Upcoming Telugu Films List : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. రచ్చ మాములుగా ఉండదేమో!
ఇందులో అకీరా నందన్ కర్రసాము చేస్తూ కనిపించాడు. జిమ్ లో మాస్క్ వేసుకొని అకీరా కర్రసాము చేసిన ఈ వీడియోకి మైకేల్ జాక్సన్ బిల్లీ జీన్ సాంగ్ ను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి వీడియోను బాగా ఎలివేట్ చేశారు. ఇప్పటికే కుంగ్ ఫూ, కరాటేతో పాటు మ్యూజిల్, డాన్స్ లలో కూడా అకీరా శిక్షణ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', 'తమ్ముడు' వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ రియల్ స్టంట్స్ తో మెప్పించారు. 'బద్రి', 'ఖుషీ' లాంటి సినిమాల్లో కూడా పవన్ తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ను చూపించారు.
ఇక తన సొంత దర్శకత్వంలో తీసిన 'జానీ' సినిమాలో స్టంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తండ్రి బాటలోనే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అకీరా వీడియో చూసిన ఫ్యాన్స్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ ఫిక్స్ అయిపోయారు. మరి వారి అంచనాలను అందుకునే రేంజ్ లో అకీరా ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.