Leo: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ నుంచి వస్తోన్న తర్వాత మూవీ ‘లియో’ గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘విక్రమ్’ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేసిన లోకేష్ ‘లియో’ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. అందులోనూ ‘లియో’ మూవీ లోకేష్ యూనివర్స్ లో భాగం అని కూడా అంటున్నారు. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పిటికే సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. దీంతో మూవీ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సినిమా నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ లు రాకుండానే ఓ ట్రైలర్ ను సొంతంగా తయారు చేసి రిలీజ్ చేశాడు విజయ్ వీరాభిమాని. అది కూడా 3డి లో ఇప్పుడీ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.  


ట్రెండింగ్ లో ‘లియో’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్..


తాము అభిమానించే హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్దపడుతుంటారు కొంత మంది అభిమానులు. దళపతి విజయ్ కు కూడా అలాంటి అభిమానులు చాలా మందే ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తయారు చేసిందే ఈ ‘లియో’ ట్రైలర్. విజయ్ వీరాభిమాని అయిన మ్యాడీ మాధవ్ తన అభిమాన నటుడి కోసం సొంతంగా ఓ ట్రైలర్ ను తయారు చేశాడు. దాన్ని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు మాధవ్. ఈ ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉంది. ఈ ట్రైలర్ ను యానిమేషన్ టెక్నాలజీతో పాటు త్రిడి ఎఫెక్ట్స్ తో సినిమా లెవల్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 8 మిలియన్ల వీక్షణలు లక్షన్నర లైక్ లు 40 వేల రీట్వీట్ లను  సొంతం చేసరుకుంది. అంతే కాదు మనోజ్ పరమహంస, అశ్విన్ రామ్, మణికందన్, వెంకట్ ప్రభు సెలబ్రెటీలు కూడా ఈ వీడియోను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. 


ఇంతకీ ఆ ట్రైలర్ వీడియోలో ఏముందంటే?


నిజంగా ఓ వీరాభిమాని తన అభిమాన హీరోను ఊహించుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే దానికి మ్యాడీ మాధవ్ చేసిన వీడియోనే ఉదాహరణ. అంతగా రిచ్ లుక్ లో విజయ్ ను చూపించాడు మాధవ్. ట్రైలర్ లో హీరో(విజయ్) తన రోల్స్ రాయిస్ కార్ లో ఓ కారును వెంబడిస్తూ ఉంటారు. ఓ అందమైన అమ్మాయి కారు నడుపుతుండగా వెనుక సీట్ లో హీరో కూల్ గా కూర్చొని కనిపిస్తాడు. తర్వాత కారును ఓవర్ టేక్ చేయమని చెప్పి తన దగ్గర ఉన్న గన్స్ తో ప్రత్యర్థులను హతమారుస్తాడు. ఈలోపు ఇంకొన్ని కార్లు వచ్చి హీరో ను చుట్టుముడతాయి. అప్పుడు హీరో కారులో నుంచి ఓ కత్తిని తీసి ‘బ్లడీ స్వీట్’ అనే టైలాగ్ చెప్తాడు అంతటితో ట్రైలర్ ముగుస్తుంది. చెప్పడానికి ఇది సింపుల్ గానే ఉన్నా అత్యాధునిక టెక్నాలజీ, 3డి ఎఫెక్ట్స్ తో విజువల్ వండర్ లా చేశాడు మాధవ్. అందుకే రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో అటు ఇటు తిరిగి విజయ్ దగ్గరకు చేరిందని, ఇది చూసి విజయ్ హర్షం వ్యక్తం చేస్తూ తనను కలవాల్సిందిగా ఆ అభిమానికి కబురు పంపాడనే టాక్ కూడా ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఇక విజయ్ నటించిన ‘లియో’ మూవీ అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది త్వరలోనే మూవీకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్.


Also Read: రికార్డు ధరకు ‘లియో’ తెలుగు రైట్స్ - ‘విక్రమ్’ క్రేజ్ కలిసొస్తుందా?