Controversial Issues: ఒకప్పుడు ఆరోపణలు, విమర్శలు పద్ధతిగా ఉండేవి. కానీ ఇప్పుడు రాను రాను భాష మారుతోంది. పొలిటికల్‌ నేతల తీరు కూడా మారుతోంది. బూతు పురాణం లేనిదే తెల్లారడం లేదు. ఇందులో ఆడ, మగ అన్న తేడా లేదు. సినిమా డైలాగుల కన్నా పొలిటికల్ లీడర్ల బూతు డైలాగులే అన్నిచోట్ల పాపులరవుతున్నాయి. లక్షల్లో వ్యూస్‌.. అంతుకు మించిన లైకులతో రాజకీయ నేతల బూతు సవాళ్లు వైరల్‌ అవుతున్నాయి. ఇదే కదా నేతలకు కూడా కావల్సింది. అందుకే రెచ్చిపోతున్నారని చెబుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. తెలుగురాష్ట్రాల్లోని రాజకీయనేతల బూతు పురాణంపై సర్వే జరిగితే అందులో కొందరు నేతల బూతులను సమర్థిస్తే ఇంకొందరు మాత్రం నచ్చడం లేదంటున్నారు. మాస్‌ ఇమేజ్‌ కోసం సినీ హీరోలు ఎలా మారుతుంటారో.. అలాగే మాస్‌ ఓటర్ల కోసం రాజకీయనేతలు కూడా తమ ఒరిజినాల్టీని బయట పెడుతున్నారని అంటున్నారు.


సినిమావాళ్లూ, రాజకీయానాయకలు తేడాలేదు...


నటనలో హీరోలని మించిపోయే రాజకీయ నేతలు ఇప్పుడు తమ అసలు రూపాన్ని చూపిస్తూ ప్రజల ముందు మంచి అనే మేకప్ ని చేరిపేసుకుంటున్నారని ఓటర్లలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రి అవ్వాలంటే ప్రత్యర్థులపై బూతు భాష ఉపయోగిస్తే చాలన్న ఆలోచనే ఈ విపరీత ధోరణికి కారణమంటున్నారు. మగాళ్లే కాదు ఇప్పుడు లేడీ పొలిటిషన్లు సైతం తొడలు కొడుతూ, బూతులు మాట్లాడుతూ తమ చేష్టలతో పేరందుకుంటున్నారు. అసలు నిన్నటి వరకు ఎవరికీ తెలియని టీడీపీ సీనియర్‌ నేత ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ ఒక్కసారిగా రాజకీయాల్లో పాపులర్‌ అయిపోయారు.


పొలిటికల్‌ రంగంలోనే కాదు ఇప్పుడు సినీరంగంలో కూడా ఈ ట్రెండే ఎక్కువైందంటున్నారు. రన్వీర్‌ కపూర్‌ బట్టలు విప్పేసుకొని తిరిగాడు కాబట్టే నిన్నటి వరకు దీపిక పదుకునే మొగుడిగా ఉన్నవాడు ఇప్పుడు డేరింగ్‌ హీరో అన్న ఇమేజ్‌ ని తెచ్చుకున్నాడు. ఇక నిన్నటి వరకు ఓ సింగర్‌ గా తెలిసిన శ్రావణి భార్గవి అన్నమయ్య కీర్తన వివాదంతో నేషనల్‌ వైడ్‌ తెలిసిపోయి వీరలెవల్లో పాపులార్టీ అందుకుంది. ఆ వీడియో సాంగ్‌ కూడా మిలియన్ల వ్యూస్‌ తో వైరల్‌ గా మారింది. ఇప్పుడావిడ యూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌ స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగిపోయింది.


సామ్ ను స్టార్ హీరోయిన్ చేసింది ఆ వార్తే..


ఇక సినిమాలు హిట్‌ కొట్టాలంటే ఒకటి సెంటిమెంట్‌ ని టచ్‌ చేసేలా ఓ ఏడుపు ఏడవాలి. లేదంటే మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు సినిమాలో పెట్టాలి. అదీ కాదంటే ఆడియో.. ప్రమోషన్‌ టైమ్‌ లో ద్వంద్వ అర్థాలు వచ్చేలా డైలాగులు విసరాలి. అది ఇదీ కాదంటే హీరోయిన్లతో కాస్తంత కాదు ఓ రేంజ్‌ లో ఓవర్‌ చేయాలి. మొన్నామధ్య ఓ చిన్నహీరో సినిమా ప్రమోషన్‌ కోసం ఓ టీవీ ఛానెల్లో గెట్‌ అవుట్‌ అనిపించుకున్నాడు. ఇంకేముంది అప్పటి వరకు అంతగా పేరులేని.. హిట్‌ లేని హీరో గెట్‌ అవుట్‌ అన్న మాటతో వీరలెవల్లో పాపులరయ్యాడు. సినిమా ఓహో అనే రేంజ్‌ లో లేకపోయినా వివాదం పుణ్యమా అని హిట్టైపోయింది.


ఇక సమంత-నాగచైతన్యల విడాకుల గురించి అయితే రోజుకో వార్త హడావుడి చేస్తోంది. సింపుల్‌ గా చెప్పాలంటే సమంతకి ప్రస్తుతం స్టార్‌ రేంజ్‌ లేదు. కానీ ఈ విడాకుల వార్తలతో దేశమంతటా క్రేజ్‌ వచ్చేసింది. ఊ కొడతావా పాట కన్నా అమ్మడి విడాకుల మ్యాటరే విస్తృతంగా పాపులరైపోయింది. ద ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ లో నటించినా కానీ రాని పేరు ఇప్పుడు సమంతకి రావడంతో ఆ క్రేజ్‌ తోనే బాలీవుడ్‌ బడా హీరోలతో బడా సినిమాలు చేసే ఛాన్స్‌ అందుకుంది. 


బాలీవుడ్ రేంజ్ కి పోయాడంట్ అదే వార్త...


ఇక లవర్‌ బాయ్‌ గా రొమాంటిక్‌ హీరో అన్న పేరుతో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన నాగ చైతన్య… సమంతతో విడాకుల తర్వాత వీర లెవల్లో ఫేమస్ అయిపోయాడు. స్టార్‌ హీరో రేంజ్‌ కన్నా ఎక్కువ పాపులార్టీ అందుకున్నాడు. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ అమీర్‌ ఖాన్‌ తో సినిమా చేసేంత రేంజ్‌ కి వెళ్లాడు. టాలీవుడ్‌ లో ఓన్లీ క్లాస్‌ జనాలకు మాత్రమే తెలిసిన నాగచైతన్య విడాకుల తర్వాత బాలీవుడ్‌ లో సినిమాలు చేసే రేంజ్‌ కి ఎదిగిపోయాడు. ఇలా ఈ స్టార్‌ కపుల్‌ విడిపోయిన తర్వాతనే దేశ వ్యాప్తంగా పాపులార్టీ అందుకోవడంతో పాటు కెరీర్‌ లోనూ ఎదిగిపోయారు. ఇక హీరోయిన్లు ఎంత విప్పుకుంటే అంతగా జనాల్లో నానుతామని కాంట్రవర్సీ డ్రస్సింగ్‌ లతో హైలెట్‌ అవుతున్నారు. మతపరమైన మాటల తరహాలోనే మతపరమైన సినిమాలు కూడా కాంట్రవర్సితో సక్సెస్‌ ని అందుకుంటున్నాయి. కశ్మీరీ ఫైల్స్‌ ఇందుకు ఓ ఉదాహరణ.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే ఉన్నాయి. 


ఈ కలికాలంలో చెడుకే ఎక్కువ ఇంట్రస్ట్‌ ఉండటంతో ఇప్పుడందరి దారి అడ్డదారిగానే మారింది. ఒకప్పుడు మహానుభావులంటే నిస్వార్థంగా పనిచేసిన వాళ్లగురించి చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మహానుభావులంటే అవినీతి, స్కాంలు, అన్యాయాలు చేసినోళ్లని చెబుతున్నారు. మంచి కన్నా చెడ్డోళ్లకే పేరు, ప్రతిష్ట అందుతున్నాయన్న భావన సామాన్యుల్లో వచ్చేసింది.