రీసెంట్ గా 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. .
జూన్ 8న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మే 25న సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో చిన్న వీడియోను వదిలారు. అందులో చైతు సినిమాకి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. 'ప్రియా.. నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి' అని డైలాగ్ చెబుతుండగా.. ఎవరో వీడియో షూట్ చేస్తున్నారని.. 'ఏ విక్రమ్.. ఏంటిది..?' అని అడుగుతాడు.
దానికి అతడు మన టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పగా.. 'మన సినిమా టీజరేనా..? ధైర్యంగా అందరికి చెప్పుకోచ్చా ..? అని సందేహంగా అడిగారు. మొత్తానికి ఈ సినిమా టీజర్ కి ముహూర్తం కుదిరింది. ఇక ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ