Taraka Ratna Wife Alekhya Reddy Support in AP Elections: దివంగత నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆమె సపోర్టు చేసే పార్టీ ఏదో తేల్చేశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో అలేఖ్యా రెడ్డి సపోర్టు చేసే పార్టీ ఏదో ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించారు. కాగా తారకరత్న మరణాంతరం ఆయన బదులుగా అలేఖ్యా రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి. అంతేకాదు అలేఖ్యా రెడ్డి ఏ పార్టీకి వెళ్లితే ఆ పార్టీకి లాభం చేకూరే అంశాలే ఎక్కువ ఉన్నాయి. దీంతో అలేఖ్యాను తమ పార్టీలోని తీసుకోవాలని వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి.
నటుడు నందమూరి బాలకృష్ణ స్వయానా మామయ్య కావడం, టీడీపీ తమ కుటుంబం పార్టీ అవ్వడం.. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలు ఆమెకు చాలా దగ్గరి బంధువులు. నాన్న లాంటి వ్యక్తి అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. ఇక తారకరత్న చనిపోయినప్పటి నుంచి ఆ కుటుంబానికి బాలయ్య, విజయ సాయి రెడ్డిలు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో అలేఖ్య ఏ పార్టీకి తన మద్దతు ఇస్తుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా పార్టీలు కూడా ఆమె మద్దతు తమకే అన్నట్టు ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలో అలేఖ్య తన నిర్ణయాన్ని ప్రకటించింది. తన మద్దతు బాలయ్యా మమయ్యకే అంటూ టీడీపీకే ఓటు వేసింది. ఈమేరకు బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేసింది. "నేను ఏ వైపు ఉన్నానని ఎప్పుడూ నాకు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను.
నా అంగీకారం ఎప్పుడూ నా కుటంబానికే
నా అంగీకారం ఎప్పుడూ మానవత్వం, ప్రేమకే ముఖ్యంగా నా కుటుంబం వైపే నేను ఎప్పుడు ఉన్నాను. బాలయ్య మామమ్య.. మిమ్మిల్ని ఓబు, నేను,పిల్లలు ఎంతో ప్రేమిస్తున్నాము" అంటూ అలేఖ్య తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్ణయం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా అయ్యింది. అయితే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వారి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. పండుగ సందర్భంగా అలేఖ్య, పిల్లలతో ఆయన కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డితో తన పిల్లలు, ఆమె దిగిన ఫోటోను షేర్ చేశారు. "మా జీవితంలో నాన్న లాంటి గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. కష్టసుఖాల్లో మాతోనే ఉంటూ ఎప్పుడు ధైర్యం చెప్పే వ్యక్తి ఆయన" అంటూ ఆమె రాసుకొచ్చింది. అప్పట్లో ఆమె పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. దీంతో అలేఖ్య రెడ్డి మద్దతు వైసీపీకే అనుకున్నారంతా. అంతేకాదు ఆమె వైసీపీలో చేరబోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇది చూసి అంతా కూడా అదే అనుకున్నారు. కానీ చివరికి తన మద్దతు టీడీపీకే అని స్పష్టం చేసి ట్విస్ట్ ఇచ్చారు అలేఖ్య.
Also Read: 'వార్ 2' కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ - థియేటర్లో ఎన్టీఆర్ విశ్వరూపమే..!