LSG vs CSK match High Lights: ఎల్ఎస్జీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ భార్య సాషా డికాక్ తన ఇన్ స్టాలో స్మార్ట్ వాచ్‌ను పోస్ట్ చేశారు. పైన క్యాప్షన్ రాశారు వెన్ ఎంస్ ధోని కమ్స్ అవుట్ టూ బ్యాట్ అని. ఈ సీజన్ అంతా చూస్తున్నదే ధోని ఆడటానికి వస్తుంటే చాలు ఆ ఎంట్రీకి చెవులు పగిలిపోయే సౌండ్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది కూడా లక్నోలోని ఎకానా నిన్న ధోని ఎంట్రీకి మారుమోగిపోయింది. 124డెసిబల్స్‌గా రికార్డైన ఆ మూమెంట్‌ను ఇదిగో సాషా డికాక్ స్మార్ట్ వాచ్ కూడా క్యాచ్ చేసింది. ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఇంకో పది నిమిషాలు ఉంటే మీకు తాత్కాలికంగా చెవుడు రావొచ్చు అని అలెర్ట్ మెసేజ్ కూడా వచ్చింది అందులో.
ఇప్పుడు క్వింటన్ డికాక్ భార్య పోస్టు చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఆ స్థాయిలో ధోనికి ఫ్యాన్స్ నుంచి రిసెప్షన్. ధోని కూడా తన ఫ్యాన్స్‌కి అన్యాయం చేయట్లేదు. వేలాది రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న వచ్చిన వాళ్లను ఎంటర్‌టైన్ చేసేలా ఫినిషింగ్‌లో అదరగొడుతున్నాడు.
నిన్న ఎల్ఎస్జీ మ్యాచ్‌లో కూడా మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే పరుగులు చేయటానికి నానా తంటాలు పడుతుంటే చివరి రెండు ఓవర్లలో 9 బంతులు మాత్రమే ఆడిన ధోని మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అందులో 360డిగ్రీల యాంగిల్‌లో తిరుగుతూ కొట్టిన స్కూప్ షాట్ సిక్స్ అయితే వేరే లెవల్. మ్యాచ్ చెన్నై ఓడిపోయినా...ధోని ఆడిన ఈ స్పెషల్ ఇన్నింగ్స్ ఆ రీసౌండ్ మాహీ ఫ్యాన్స్ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి.
చెపాక్‌లో పులులు- చెపాక్ బయట చపాతీలు.!
మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచి ఐపీఎల్‌లోనే తోపు జట్లలో ఒకటి అనిపించుకున్న సూపర్ కింగ్స్ కేవలం హౌం గ్రౌండ్స్‌లోనే పులులా బయట మాత్రం అంత సీన్ లేదా. ఈ సీజన్‌లో ఆట చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఇప్పుడు వరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై చెపాక్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడితే మూడు గెలిచింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్‌పై గ్రాండ్ విక్టరీస్ కొట్టింది. కానీ చెపాక్ బయట నాలుగు మ్యాచ్‌లు ఆడితే ఒక్కటి మాత్రమే గెలిచింది. విశాఖలో ఢిల్లీ మీద, హైదరాబాద్ లో SRH మీద నిన్న లక్నోలో LSG మీద ఓటమిపాలైంది. ఒక్క వాంఖడేలో మాత్రమే ముంబై మీద గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్.
హోం గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు బలమైన జట్టుగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్... బయట ఆడుతున్నప్పుడు మాత్రం వైఫల్యాల బాట పడుతోంది. నిన్న ఎల్ఎస్జీ మీద మొదట బ్యాటింగ్ చేసి అసలు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడుతూ కనిపించింది. కానీ అదే టఫ్ పిచ్ పై లక్నో ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా 134పరుగులు చేశారు. ఓపెనర్లే హాఫ్ సెంచరీలు బాది 8వికెట్ల తేడాతో లక్నోకు విక్టరీని అందించారు. సీజన్ క్రూషియల్ స్టేజ్ కి చేరుకుంటున్న ఈ స్టేజ్ లో ఇలా ఎవే మ్యాచెస్‌లో చెన్నై ఓడిపోతే మిగిలిన జట్లు డామినేట్ చెసే అవకాశం ఉంది.
ఒక్క ఆర్సీబీ తప్ప మిగిలిన జట్లన్నీ పోరాట పటిమ చూపిస్తున్న ఈ ఐపీఎల్‌లో చెన్నై ఇంటా బయట నెగ్గుకురాకపోతే క్వాలిఫైయర్స్ ముందు షాక్స్ తగిలి సీఎస్కే చరిత్రలో మరో బ్యాడ్ సీజన్‌గా మిగిలిపోయే ప్రమాదమూ ఉంది.