ప‌ద‌లో ఉన్న‌వారికి సాయం చేయాల‌న్న గుణం ఉండాలేగానీ.. ఎక్క‌డ ఉన్నా మ‌న‌వంతు చేయూత అందించ‌వ‌చ్చు. ఇప్పుడు ప్ర‌ముఖ న‌టి కృతిశెట్టి కూడా ఇదే బాటలో నడుస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను మొదలు పెట్టింది. ‘నిష్న- ఫీడ్ ది నీడ్’ పేరుతో ఎన్టీఓను ప్రారంభించింది. తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కృతిశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా తెలిపింది.


సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఏడాది అయిన సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది కృతి. తన కెరీర్ తో పాటు వ్యక్తిగతంగానూ పలు విషయాలను తెలుసుకున్నట్లు తెలిపింది. కష్టాల్లో ఉన్నవారికి ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతోనే  స్వచ్ఛంద సంస్థను స్థాపిస్తున్నట్లు తెలిపింది. అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది. తన బర్త్ డే సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది కృతి. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టాలని పిలుపునిచ్చింది.





 ఈ ఎన్టీవో ద్వారా.. పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్యవ‌స‌ర స‌రుకులు,  దుస్తులు, ప‌రిశుభ్ర‌త సామ‌గ్రి అందించనున్నట్లు కృతి తెలిపింది.  ఇబ్బందుల్లో ఉన్న ఉన్న పేద‌లు తమను సంప్రదిస్తే తమకు తోచిన సాయం చేస్తామని వెల్లడించింది. కృతి నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఎంతో గొప్ప మనసని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి వరుస అవకాశాలు దక్కించుకున్నది. తాజాగా ఈమె నటించిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాపై బోలేడన్ని ఆశలు పెట్టుకున్న కృతి బాగా నిరాశకు లోనైంది.  దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ రావడంతో.. కలెక్షన్స్‌ పూర్తిగా పడిపోయాయి. ఈ సినిమా కంటే ముందు వచ్చిన రామ్ పోతినేతి ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు.   


కెరీర్‌ బిగినింగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలను అందుకున్న కృతిశెట్టికి ఇలా వరుసగా హ్యాట్రిక్‌ ఫ్లాపులు రావడంతో తెగ ఆందోళన చెందుతోందట. ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్‌లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం కృతి చేతిలో నాగచైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి. నాగ చైతన్యతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ రెండు చిత్రాల ఫలితంపైనే కెరీర్‌ ఆధారపడింది. కృతిశెట్టి ఈ నెల 21న తన 19వ పుట్టిన రోజును జరుపుకుంది.


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!