యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను వదిలారు. అదొక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిజానికి ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ ఆలస్యమవుతుంది. 


ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ కి వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియాభట్(Alia Bhatt) ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నన్సీ కారణంగా నో చెప్పింది. ఆ తరువాత చాలా మంది పేర్లను పరిశీలించారు. జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అని వార్తలొచ్చాయి. 


కానీ అందులో నిజం లేదని తేల్చి చెప్పింది జాన్వీ. కొద్దిరోజులుగా.. కృతిశెట్టి(Krithi Shetty)ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక బాలీవుడ్ హీరోయిన్ తో పాటు కృతిశెట్టి కూడా కనిపిస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. కృతిశెట్టి నటించిన 'మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది కృతి. 


Krithi Shetty Is Not Part Of NTR30: ఈ సందర్భంగా ఆమెకి ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె.. ఎన్టీఆర్30కి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. అయితే టాలీవుడ్ లో బిగ్ స్టార్స్ తో నటించాలనేది తన కోరిక అని.. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. సుధీర్ బాబుతో ఓ సినిమా, అలానే నాగచైతన్య ఓ సినిమా కమిట్ అయింది. త్వరలోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతిశెట్టి. సూర్య, బాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఫ్యూచర్ లో ఆమె మరిన్ని కోలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఉంది.



Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!


Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!