Krishnam Raju Dies - Live Page: కృష్ణం రాజు ఇక లేరు - సోమవారం అంత్యక్రియలు, పార్థీవ శరీరానికి ప్రముఖుల నివాళులు

ప్రముఖ నటుడు, సీనియర్ కథానాయకుడు కృష్ణం రాజు ఇకలేరు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

ABP Desam Last Updated: 11 Sep 2022 08:42 PM

Background

ప్రముఖ నటుడు, సీనియర్ కథానాయకుడు కృష్ణంరాజు (Krishnam Raju) ఇకలేరు. ఈ రోజు ఉదయం తిరిగిరాని లోకాలకు ఆయన వెళ్లిపోయారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో...More

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు 

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఇంటి నుండి సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరనుంది.