కృష్ణ అల్లరితనమే తనకి నచ్చిందని మురారీ అనుకుంటాడు. అటు కృష్ణ మాత్రం మోయలేనంత బాధను భరిస్తూ ఉంటుంది. కృష్ణ మధుకర్ రీల్స్ అడ్డం పెట్టుకుని తన మనసులో మాట బయట పెట్టింది. నిజంగా కృష్ణ నాతో ప్రేమలో పడిందని ఆశ కలిగింది ఆ క్షణాలు నిజమైతే బాగుండని మురారీ తన డైరీలో రాసుకున్నవి గుర్తు చేసుకుంటాడు. కృష్ణ ఓపెన్ అయ్యి తను నన్ను ప్రేమిస్తుందని నిజం చెబితే తప్ప ఈ ఖాళీ పేజీ డైరీలో ఏమి రాయలేనని బాధపడతాడు. డైరీని మళ్ళీ దాచిపెట్టి కృష్ణ కోసం ఇల్లంతా వెతుకుతాడు. బయట వర్షంలో నిలబడి కృష్ణ తనివితీరా ఏడుస్తుంది.
Also Read: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్
‘నాలో ప్రేమ పుట్టగానే చచ్చిపోయింది ఎంత దురదృష్టం. అమ్మని ప్రేమించాను తను చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నాన్నని ప్రేమించాను ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. జీవితంలో మొదటిసారిగా నా మనసులో ప్రేమ పుట్టింది కానీ ఆ ప్రేమకి ఆయుష్హు లేదు. కొన్ని గంటల్లోనే నాకు ఆ అదృష్టం లేదని తేలిపోయింది. మళ్ళీ నేను ఒంటరి దాన్నే అనాథనే. నాకు ఈ లోకంలో ఎవరూ నావాళ్ళు లేరు ఏసీపీ సర్. మీలో కూడా నా మీద ప్రేమ ఉందని ఆశపడ్డాను కానీ మీ మనసులో ఎప్పుడో ఇంకొక అమ్మాయికి చోటు ఇచ్చారని తెలిసింది. మీతో ఉండటానికి నాకు ఏ అర్హత ఉందని ఉండాలి. ఒప్పందం ప్రకారం గడువు తీరగానే వెళ్లిపోవాలా? ఒంటరిగా పలకరించే దిక్కు లేక అనాథలా మిగిలిపోవాలా? అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను’ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది.
కృష్ణ వర్షంలో ఉండటం చూసి మురారీ పరిగెత్తుకుంటూ వస్తాడు. పిచ్చి పట్టిందా లోపలికి రమ్మని పిలుస్తాడు. మీరు వెళ్ళండి ఈ వాన కురుస్తూ ఉండాలి నేను తడవాలి. నా మనసు నిర్మలంగా మారినప్పుడు వస్తాను. నిజమే కలగా మారింది. మీకు మీ ప్రశ్నలకు జవాబులు చెప్పే ఓపిక లేదు. నాదగ్గర బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయని అంటుంది. నేనేమైనా నిన్ను బాధ పెట్టానా అంటాడు. అవును మీరు ఏసీపీ కాదు పెద్ద దొంగ.. వెళ్లిపోండి మీరు. ఇంత వాన కురిసినా నా గుండె మంట చల్లారడం లేదు. మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోండని ఖరాఖండీగా చెప్తుంది. నిన్ను వదిలి ఎలా వెళ్లిపోతానని మురారీ బాధగా అడిగేసరికి కృష్ణ నవ్వుతూనే ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. నాకంటూ ఎవరూ లేరు ఒంటరి దాన్ని అయిపోయానని కృష్ణ ఏడుస్తుంది. నేను ఉండగా నువ్వు ఒంటరివి కాలేవని ధైర్యం చెప్తాడు.
Also Read: అభిమన్యుని చితక్కొట్టిన యష్- మాళవికని ఇంటికి తీసుకొచ్చిన వేద
మురారీ మళ్ళీ డైరీ రాస్తాడు. ఏమైంది కృష్ణకి హఠాత్తుగా ఎందుకు ఇలా ప్రవర్తించింది? తన మనసులో నేను ఉన్నానని చెప్తుందని ఆశపడుతుంటే ఎందుకు నన్ను వదిలి వెళ్లిపోతానని పట్టుబట్టిందని అనుకుంటాడు. కృష్ణ దేవుడి ముందు నిలబడి ఈ సమస్యకి ఒక పరిష్కారం ఇవ్వు. ఆయన ప్రేమించిన ప్రియురాలి స్థానంలో ఉండాలా? ఆయనకి భార్యగా ఉండాలా? ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిసేలా చేయమని వేడుకుంటుంది. అప్పుడే ముకుంద వచ్చి కృష్ణ ప్రవర్తన గురించి ఆలోచినలో పడుతుంది. ఏసీపీ సర్ ప్రియురాలు ఎవరో తెలిస్తే వాళ్ళిద్దరినీ కలిపి నేను వెళ్లిపోవాలా? ప్రేమ పుట్టిన కొన్ని క్షణాల్లోనే అది పోయిందని బాధపడుతుంది. సమస్య ఏంటో చెప్పమని పరిష్కారం చూపిస్తానని ముకుంద అడుగుతుంది. కానీ కృష్ణ మాత్రం అసలు విషయం చెప్పకుండా తింగరి సమాధానం చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏదో నిజాన్ని దాచి పెడుతుంది అడిగితే దాటేస్తుందని అనుమానపడుతుంది.