మురారీ శ్రీనివాసరావు మాటల గురించి ఆలోచిస్తుంటే కృష్ణ వచ్చి భయపెడుతుంది. ఇంట్లో జరిగింది ఏంటి నువ్వు చేసే అల్లరి ఏంటని అంటాడు. పెద్దమ్మ వెళ్తుంటే ఆయన అలా వచ్చి గొడవ చేయడం కరెక్టేనా అంటే వంద శాతం కరెక్ట్ ముకుందకి ఇంకొక పెళ్లి చేయడం సరైన నిర్ణయం. ఆదర్శ్ రాకపోతే తన పరిస్థితి ఏంటని కృష్ణ కూడా అంటుంది.


మురారీ: ఒకవేళ ఆదర్శ్ తిరిగి వస్తే


కృష్ణ: పెళ్ళైన వెంటనే వెళ్ళిపోయిన ఆదర్శ్ ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? ఆయన తండ్రి అన్న మాటల్లో తప్పు లేదు. తనకీ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి కదా


మురారీ: ఆదర్శ్ తప్పకుండా తిరిగి వస్తాడు


కృష్ణ: రాకపోతే పరిస్థితి ఏంటి?


ALso Read: చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్న స్వప్న- ఇంట్లో చిచ్చు రాజేసిన రుద్రాణి


మురారీ: ముకుంద మనసులో ఏ ఆలోచన ఉందో నీకు తెలియదు కృష్ణ. నువ్వు వెళ్లిపోతే నన్ను పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటుంది. కానీ నాకు కూడా ముకుంద తండ్రి తనని తీసుకెళ్ళి ఒక మంచి మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండనే ఆశ నాకు కూడా ఉందని మనసులో అనుకుంటాడు.


ముకుంద తండ్రి దగ్గరకి వస్తుంది. తప్పు మీదే నేను మురారీని ప్రేమించానని మీకు తెలిసి కూడా ఆదర్శ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడే ఓపిక పట్టి మురారీతో పెళ్లి జరిపించి ఉంటే నేను ఇలా అయ్యేదాన్ని కాదుగా. ఎదురు గదిలో మురారీ భార్యతో ఉంటే నేను నా గదిలో ఒంటరిగా ఉంటున్నా. ప్రేమించిన వ్యక్తి ఎదురుగా మరో ఆడదానితో ఉంటే ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించారా? ఇంకో పెళ్లి చేస్తే నేను ముగ్గురు మగాళ్లతో ఉంటే ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా? నా మనసులో మురారీ తప్ప ఎవరూ లేరు.


శ్రీనివాసరావు: అది నేరం పాపం, అలాంటి ఆలోచన రాకూడదు


ముకుంద: అయితే జడ పదార్థంగా ఉండమంటావా? నా మనసులో మురారీ మాత్రమే ఉంటాడు. మధ్యలో ఆదర్శ్ వచ్చి పోయాడు. నా భర్త తిరిగి రాడని అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నేను మురారీని పెళ్లి చేసుకుంటే తప్పు ఏంటి?


శ్రీనివాసరావు: అది తప్పు, నీతి తప్పిన దానివి అవుతావు


ముకుంద: నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? జీవితాంతం తన మనసులో నేనే ఉంటానని మురారీ మాట ఇచ్చాడు


శ్రీనివాసరావు: మాట తప్పాడు కదా


ముకుంద: ఆ పెళ్లి పెళ్ళే కాదు అది మురారీ గురువుగారి కోసం ఇచ్చిన మాట కోసం చేసుకున్న పెళ్లి. వాళ్ళు కలిసి బతకడానికి పెళ్లి చేసుకోలేదు విడిపోవడానికి పెళ్లి చేసుకున్నాడు.


శ్రీనివాసరావు: మరి మురారీ నిన్ను పెళ్లి చేసుకుంటాడా?


ముకుంద: లేదు ఆదర్శ్ వస్తాడని నమ్ముతున్నాడు. కృష్ణ వెళ్లిపోగానే మురారీని పెళ్లి చేసుకుంటాను. ఆదర్శ్ తో విడాకులు ఇప్పిస్తానని అన్నావ్ కదా ఇప్పించి మురారీతో నా పెళ్లి జరిపించు


Also Read: నందు స్త్రీలోలుడని లాస్య పుకార్లు- పంతులు తిక్క కుదుర్చి మాస్టర్ ప్లాన్ వేసిన దివ్య


మురారీ పని చేసుకుంటుంటే కృష్ణ వచ్చి తనకి ప్రేమగా ఫుడ్ తినిపిస్తుంది. అదంతా ప్రసాద్ కొడుకు వీడియో తీస్తాడు. కృష్ణకి ప్రపోజ్ చేయమని అడుగుతాడు. వద్దు బాగోదని మురారీ టెన్షన్ పడతాడు. మురారీ చేతికి గులాబీ పువ్వు ఇచ్చి